సొంతూళ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ షాక్.. ఈటలకు ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చిందంటే..

ABN , First Publish Date - 2021-11-02T19:37:51+05:30 IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ దూసుకుపోతోంది. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఎన్నికల కౌంటింగ్‌‌లో రౌండు రౌండుకూ బీజేపీ తన అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

సొంతూళ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ షాక్.. ఈటలకు ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చిందంటే..

హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ దూసుకుపోతోంది. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఎన్నికల కౌంటింగ్‌‌లో రౌండు రౌండుకూ బీజేపీ తన అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరకు ఓటర్లు మాత్రం ఈటల వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సొంత గ్రామంలోనూ ఈటల తన ఆధిక్యాన్ని సాధించి.. టీఆర్ఎస్ నాయకులకు గట్టి షాక్ ఇచ్చారు.


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ సొంత గ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లోనూ ఆయన వెనుకబడ్డారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల.. టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 191 ఓట్ల మోజారిటీ సాధించారు. అన్ని రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శిస్తున్న ఈటల.. తొమ్మిదో రౌండ్‌లో భారీ ఆధిక్యం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఏకంగా.. 1835ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో మొత్తంగా ఈటల భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - 2021-11-02T19:37:51+05:30 IST