అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పాలకులు పఠించాలి: ఈటల రాజేందర్

ABN , First Publish Date - 2021-04-14T18:10:30+05:30 IST

అణగారిన వర్గాల కోసం.. అణచివేతకు గురైన వారి కోసం పోరాడిన వ్యక్తి అంబేడ్కర్ అన్నారు మంత్రి ఈటల రాజేందర్. ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన..

అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పాలకులు పఠించాలి: ఈటల రాజేందర్

హైదరాబాద్: అణగారిన వర్గాల కోసం.. అణచివేతకు గురైన వారి కోసం పోరాడిన వ్యక్తి అంబేడ్కర్ అన్నారు మంత్రి ఈటల రాజేందర్. ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల, కులాల ప్రజలందరూ కలిసి మెలసి ఉండాలని కోరుకున్నారని, స్వేచ్ఛా, సమానత్వం ఆయన ఆశయం అన్నారు. కులరహిత, మతరహిత సమాజం అంబేడ్కర్ లక్ష్యమన్నారు. ఈనాటికీ కూడా రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయడం దురదృష్టకరమన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పాలకులు పఠనం చేసి ప్రజలకు మేలు చేయాలన్నారు. దళితులు నేటికీ భయంకరమైన జీవితం గడుపుతున్నారని ఈటెల వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-04-14T18:10:30+05:30 IST