Abn logo
Oct 9 2021 @ 18:44PM

రౌడీషీటర్‌ను ఇష్టపడ్డ యువతి.. తర్వాత ఈ రౌడీ లవర్స్ చేసిన పనేంటో తెలిస్తే Shok అవుతారు..!

ప్రేమలో ఉన్నవారికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. ప్రియురాలి కోసం ప్రియుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. తను అడగాలే కానీ.. కొండమీద కోతినైనా తెచ్చిస్తారు. ఇక్కడ ఓ ప్రేమికుడు అంతకంటే ఎక్కువే చేశాడు. ప్రియురాలి కోరికలు తీర్చడానికి.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి చేసిన పనులు.. పోలీసులకు నిద్ర లేకుండా చేశాయి. ఈ రౌడీ లవర్స్ చేసిన పనులు చూస్తే.. సినిమా సీన్లు కూడా చిన్నబోతాయి. అలాగే ఈ దొంగ ప్రేమికుల ప్రేమకథ కూడా విచిత్రంగా ఉంటుంది...


వినయ్ అనే వ్యక్తికి కీర్తన అనే యువతితో మూడేళ్ల కిందట పరిచయమైంది. అప్పటికే వినయ్ రౌడీ షీటర్. ఇది తెలిసినా కీర్తన.. అతన్ని ప్రేమించింది. వారి పరిచయం చివరికి ప్రేమగా మారింది. ఈ క్రమంలో కీర్తన కోరికలన్నింటినీ వినయ్ తీరస్తూ వచ్చాడు. తనను లాంగ్​డ్రైవ్‌కు తీసుకెళ్లాలని, విలువైన బహుమతులు కావాలని పదే పదే అడుగుతుండేది. ఇందుకోసం కావాల్సిన డబ్బులు లేకపోవడంతో వినయ్.. చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలో తన ప్రియురాలిని కూడా చోరీలకు తీసుకెళ్లేవాడు. వచ్చిన సొమ్ముతో ఇద్దరూ జల్సాలు చేసేవారు. ఇలా విలాసంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. 

ఇల్లు అద్దెకు కావాలంటూ వస్తారు. ఈ క్రమంలో ఇంటి యజమానిని ఏమార్చి.. విలువైన వస్తువులు దొంగిలించేవారు. బెంగళూరులో ఈ తరహా చోరీలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అక్టోబర్ 4వ తేదీన ఓ ఇంటికి వెళ్లారు. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగస్తులుగా పరిచయం చేసుకున్నారు. ఇల్లు అద్దెకు కావాలంటూ ఓనర్ దృష్టిని మరల్చి.. ఒక మొబైల్​ఫోన్, ల్యాప్​టాప్, రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారు. అనుమానం వచ్చిన ఆ యజమాని.. సీసీ ఫుటేజీని పరిశీలించగా విషయం బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ దొంగ ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు వారి ప్రేమకథ, చోరీల విషయాలన్నింటినీ బయటపెట్టారు. వినయ్ కోసం ఏమైనా చేస్తానని, అవసరమైతే జైలుకు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కీర్తన చెబుతోంది. ఈ విషయం తెలిసిన వారు.. ఈ ప్రేమజంట గురించి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...