Abn logo
Sep 25 2021 @ 13:20PM

ఆరోగ్యం, అభివృద్ధిని కలగలిపిన క్రెడిట్ మోదీదే: మన్షుక్ మాండవీయ

న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్యం, అభివృద్ధి రెండింటినీ కలిపి ముందుకు తీసుకువెళ్లే సంప్రదాయం లేదని, అయితే ఆ పని ప్రధానమంత్రి మోదీ చేశారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ప్రశంసించారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో శనివారంనాడు ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆరోగ్య బడ్జెట్ రూ.2.40 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. 'ఆరోగ్యకర భారతం' కలలు సాకారం చేయాలనే తపనతో మోదీ ఈ పని చేశారని అన్నారు. హెల్త్ సెక్టార్‌లో ఎయిమ్స్ ఒక 'లైట్‌హైస్' అని మంత్రి కొనియాడారు. ప్రజలకు ఎయిమ్స్‌పై ఎంతో నమ్మకం ఉందని, పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా 22 ఎయిమ్స్‌ల ఇనాగరేషన్ వర్క్ ఈరోజు జరుగుతోందని చెప్పారు.

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా మాట్లాడుతూ, కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినట్లయితే దానికి ఎదుర్కొనేందుకు అవసరమైన శిక్షణ, కెపాసిటీ బిల్టింగ్‌లో కూడా తాము ముందున్నామని చెప్పారు. గత మూడేళ్లలో సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ దేశంలోనే నెంబర్ వన్ మెడికల్ కాలేజీ ర్యాంక్‌ను ఎయిమ్స్ నిలబెట్టుకుందని చెప్పారు.  కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption