Oct 20 2021 @ 03:55AM

నిజంగానే రొమాంటిక్‌గా ఉంది

‘రొమాంటిక్‌ సినిమా ట్రైలర్‌ నిజంగానే రొమాంటిక్‌గా ఉంది. ఆకాశ్‌ అద్భుతంగా నటించాడు. కొన్ని షాట్స్‌లో అతని నటన చూస్తుంటే  పదేళ్ల అనుభవం ఉన్నట్లు అనిపించింది. మొదటి సినిమాకూ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. హీరోయిన్‌ కేతిక అందరికీ ఈజీగా రీచ్‌ అవుతుంది.  దర్శకుడు సినిమాను బాగా తీశారు. చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అన్నారు ప్రభాస్‌. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి, కేతికా శర్మ జంటగా నటించిన ‘రొమాంటిక్‌’ చిత్రం ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. 


ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాను విడుదల చేస్తున్నామని తెలిశాక ‘సినిమా గురించి ట్వీట్‌  చేయాలా, పోస్ట్‌ చేయాలా, ఏదైనా ఇంటర్య్యూ ఇవ్వాలా, ఈవెంట్‌కు రావాలా’ అని ప్రభాస్‌ పదేపదే అడిగారు. అంత మంచివాడు ఆయన.’ అన్నారు.


నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ మాట్లాడుతూ ‘ఈ నెల 29న ‘రొమాంటిక్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇందులో ఒక స్పెషల్‌ సాంగ్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతోంది. రమ్యకృష్ణగారు అద్బుతంగా నటించారు. వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చిన అనిల్‌ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’ అని తెలిపారు.