Unmukt Chand: అది నాకు పెద్ద మెంటల్ టార్చర్‌లా అనిపించింది.. అందుకే ఆ పని చేశా!

ABN , First Publish Date - 2021-08-22T17:28:51+05:30 IST

భారత యువ క్రికెటర్ ఉన్మక్త్ చంద్ ఇటీవల ఇండియన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని అమెరికాకు ఆడుతున్న విషయం తెలిసిందే.

Unmukt Chand: అది నాకు పెద్ద మెంటల్ టార్చర్‌లా అనిపించింది.. అందుకే ఆ పని చేశా!

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటర్ ఉన్మక్త్ చంద్ ఇటీవల ఇండియన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని అమెరికాకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఉన్మక్త్ 28 ఏళ్లకే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో మొదట అందరూ షాకయ్యారు. కానీ, ఆగస్టు 13న రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన ఈ ఢిల్లీ ఆటగాడు.. అదే రోజు మైనర్ లీగ్ క్రికెట్‌లో సిలికాన్ వ్యాలీ స్ట్రైకర్స్ తరఫున బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో‌లో స్థిరపడ్డ ఉన్మక్త్.. ఈ అనూహ్య నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని తాజాగా బయటపెట్టాడు.


గడిచిన కొన్నేళ్లు సొంత రాష్ట్రం ఢిల్లీ తరఫున గానీ, అటు టీమిండియాలో గానీ చోటు దక్కకపోవడంతో తనకు చాలా కఠినంగా గడిచాయని పేర్కొన్నాడు. గతేడాది ఢిల్లీ తరఫున తనకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదని వాపోయాడు. మ్యాచులు ఆడే అవకాశం లేక బయట కూర్చొవడం, ఏవో గల్లీ మ్యాచులు ఆడడం పెద్ద మెంటల్ టార్చర్‌లా అనిపించిందంటూ చెప్పుకొచ్చాడు. దాంతో భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. అమెరికాకు ఆడుతున్నట్లు తెలిపాడు. ఇక 2012లో ఉన్మక్త్ చంద్ సారథ్యంలోనే భారత్ అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే.     

Updated Date - 2021-08-22T17:28:51+05:30 IST