ఇతర హీరోల పక్కన మమ్మీని తెరపై చూడటం ఇబ్బందిగా ఉండేది : స్టార్ హీరోయిన్ కూతురు

సీనియర్ నటి హేమా మాలిని, బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్రల కూతురు ఈషా డియోల్. ‘ధూమ్‘ సినిమాతో హిందీ తెరపై దుమ్ము రేపింది గ్లామరస్ బ్యూటీ. అయితే, తరువాతి కాలంలో పెద్దగా కమర్షియల్ సక్సెస్ దక్కకపోవటంతో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోయింది. ప్రస్తుతం మరోసారి సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీకి ట్రై చేస్తోంది. కానీ, స్వయంగా తాను కూడా బిగ్ స్క్రీన్‌పై హాట్ రొమాంటిక్ సీన్స్‌లో నటించిన ఈ డస్కీ సుందరి, తల్లి గురించి మాత్రం, డిఫరెంట్‌గా స్పందించింది.


ఈషా డియోల్ చిన్నప్పుడు హేమా మాలిని సినిమాలు చూడాలంటే కాస్త ఇబ్బంది పడేదట. ముఖ్యంగా, ఆమె ఇతర హీరోలతో కలసి నటించిన సినిమాలు ఈషాకి పెద్దగా నచ్చేవి కావట. ధర్మేంద్ర, హేమా జంటగా నటించిన ‘సీతా ఔర్ గీతా’ మాత్రం దాదాపు ప్రతీ రోజూ స్కూల్ నుంచీ ఇంటికి రాగానే చూసేదట! ఈషా డియోల్‌కి వాళ్ల అమ్మ ఇతర హీరోలతో నటించటమే కాదు... ధర్మేంద్ర ఇతర హీరోయిన్స్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయటం కూడా నచ్చేది కాదట. కానీ, తన అయిష్టాన్ని ఆమె తల్లిదండ్రులకి ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది. నటీనటుల పిల్లలకి ఇలాంటి సమస్యలు సహజమే! అది వారి వృత్తి తెచ్చిపెట్టిన అనివార్య ఇబ్బంది! 

Advertisement

Bollywoodమరిన్ని...