Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 04 Jul 2022 00:32:30 IST

బడికి వేళాయే... వసతులు అరకొరే..!

twitter-iconwatsapp-iconfb-icon
బడికి వేళాయే... వసతులు అరకొరే..!ఈ ఫోటోలో కనిపిస్తోంది కలసపాడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. నాడు-నేడు రెండో దశలో ఎంపికైంది. అదనపు గదులు, మరుగుదొడ్ల కోసం ఉన్న మరుగుదొడ్లు, తరగతి గదులను కూల్చి వేశారు. మరుగుదొడ్ల నిర్మాణం సంబంధించి కేవలం పునాదలు మాత్రమే తీశారు. రేపటి నుంచి పాఠశాల ప్రారంభం అవుతుంది. ఇక్కడ మరుగుదొడ్లు లే కపోతే ఎలా.

మరుగుదొడ్లు లేవు... తాగునీరు కరువు

ప్రారంభం కాని రెండో విడత నాడు-నేడు పనులు 

ముందస్తుగా పాఠశాల భవనాలు కూల్చివేత 

అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి 

చెట్ల కిందనే పాఠాలు

కడప, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘అమ్మఒడి.... నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి వైభవం తీసుకొచ్చాం. కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నాం. దీంతో పాఠశాలలో విద్యార్థులు ఫుల్‌ అవుతున్నారు. కార్పొరేట్‌ హంగులకు ముగ్దులవుతున్నారు...’ అని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అయితే అమ్మఒడిని అటుంచితే...నాడు-నేడు ద్వారా నేటికీ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. రేపటి (ఈ నెల 5వ తేదీ మంగళవారం) నుంచే పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి బృందం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విజిట్‌ నిర్వహించింది. చాలావరకు పాఠశాలల్లో సమస్యలు తిష్ట వేసి.. విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాయి.


వేధిస్తున్న సమస్యలు

ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించలేని పేదలకు ప్రభుత్వ పాఠశాలలే దిక్కు. అయితే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి... అధ్యాపకులను నియమిస్తే చదువులకు కొరత ఉండదు. అయితే ప్రభుత్వ బడుల్లో సమస్యలు వేధిస్తున్నాయి. రెండో విడత నాడు-నేడు కింద ఎంపికైన పాఠశాలల్లో పాఠశాలలు తెరిచే నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ నేటికీ చాలా చోట్ల పనులు ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల పనులు చేసేందుకు ఉన్న భవనాలు, మరుగుదొడ్లను కూల్చేశారు. ఇక వాటి నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు విద్యార్థులు అవస్థలు పడాల్సిందే. చెట్ల కిందే బోధన సాగాల్సిందే. ఇక నాడు-నేడు గురించి ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఆ పనులను పాఠశాల పునఃప్రారంభమయ్యే లోపు పూర్తి చేసి ఉంటే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరేది. రెండో విడత కింద ఎంపికైన పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయాలంటే కనీసం మూడు నుంచి ఆరు మాసాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అది కూడా సకాలంలో బిల్లులు వేస్తే కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు పూర్తి చేస్తారు. లేకుంటే వచ్చే విద్యా సంవత్సరానికి కూడా పూర్తి కావని అంటున్నారు. కాగా జిల్లాలో ప్రభుత్వ, ఎయిడె డ్‌ 2147 పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడతలో సుమారు 1000 పాఠశాలలో నాడు-నేడు ద్వారా పనులు చేపట్టారు. ఉమ్మడి కడప జిల్లాలో రెండో విడతలో  874 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో 592 పాఠశాలలో మౌలిక వసతులు, 100 అదనపు తరగతి గదులు, 75 పాఠశాలలో అదనపు గదులు, మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందుకు గాను రూ.275.25 కోట్లు కేటాయించారు. 


చెట్ల కింద తరగతులు

రెండో విడతలో నాడు-నేడు ద్వారా ఎంపికైన పాఠశాలలో ఇంత వరకు పనులు పూర్తి కాలేదు. తాగునీటి సరఫరా, విద్యార్థులకు అవసరమైన ఫర్నీచర్‌, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం, వంట గది,  ప్రహారీ గోడలు,  ఇంగ్లీష్‌ ల్యాబ్‌, లైట్లు, ఫ్యాన్లు, తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అయితే చాలా పాఠశాలల్లో పనులు మొదలు కాలేదు.  అదనపు మరుగుదొడ్ల కోసం తరగతి గదులను కూల్చేశారు. అవి పూర్తి కావాలంటే మూడు నుంచి ఆరు మాసాలు పడుతుంది. దీంతో అప్పటి వరకు  చెట్ల కింద విద్యాబోధన చేయాలా... అంటూ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాగేందుకు మంచినీరు ఉండదు. మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


డిసెంబర్‌ లోపు పనులు పూర్తి

- ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఎ్‌సఏ పీడీ

రెండో విడత నాడు-నేడు ద్వారా ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేస్తాం. డిసెంబర్‌లోపు భవనాలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. 

బడికి వేళాయే... వసతులు అరకొరే..!ఈ ఫోటోలో కనిపిస్తున్నది పెద్దగోపవరం ప్రాథమిక పాఠశాల మరుగుదొడ్డి, ఇక్కడ నీళ్లు లేవు. నిర్వహణ లేదు. చెత్తతో నిండిపోయి అధ్వాన్నంగా ఉంది. ఇదే పరిస్థితి చిన్నగోపవరం పాఠశాలలో కూడా నెలకొంది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.