వాసుదేవ బ్రహ్మోత్సవాలకు వేళాయే!

ABN , First Publish Date - 2021-03-01T05:39:03+05:30 IST

రిత్ర కలిగిన మందస వాసుదేవ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 8 వరకూ వేడుకలు కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి భక్తులు అధికసంఖ్యలో రానుండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. వాసు

వాసుదేవ బ్రహ్మోత్సవాలకు వేళాయే!
మందసలోని వాసుదేవ ఆలయం








నేటి నుంచి తొమ్మిదిరోజుల పాటు నిర్వహణ

ఏర్పాట్లు పూర్తి

(మందస)

సుదీర్ఘ చరిత్ర కలిగిన మందస వాసుదేవ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 8 వరకూ వేడుకలు కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి భక్తులు అధికసంఖ్యలో రానుండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. వాసుదేవుని బ్రహ్మోత్సవాలు 2010లో పున: ప్రారంభించారు. ఈ ఏడాదితో పుష్కరకాలం కానుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ ఆలయం ఎంతో ప్రాచినమైనది. సుదీర్ఘ చరిత్ర ఉందని స్థల పురాణం చెబుతోంది. 14వ శతాబ్దం నాటి దేవాలయాన్ని మందస రాజులు ఆరాధించారు. 17వ శతాబ్దం వరకూ ఎందరో సంస్థానాధీశులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 1779-1823 మధ్య లక్ష్మణ్‌రాజమణిదేవ్‌ రాజు ఏటా తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వచ్చారు. 1956లో సంస్థానాల విలీనం వరకూ బ్రహ్మోత్సవాల ప్రక్రియ కొనసాగింది. అటు తరువాత పాలకుల నిరక్ష్యం, పట్టించుకునే వారు లేక ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దశాబ్ద కాలం కిందట  త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి శ్రీకూర్మం నుంచి పూరీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆ సందర్భంలో వాసుదేవ ఆలయ దుస్థితిని చూసి చలించిపోయారు. ఆలయ చరిత్రను తెలుసుకున్నారు. ఇక్కడ పెదజీయర్‌ స్వామి, గోపాలాచార్య స్వామిజీ తదితరులు శ్రీభాష్యం నేర్చుకున్న దృష్ట్యా  ఆలయ పూర్వవైభవానికి చినజీయర్‌స్వామి కంకణం కట్టుకున్నారు. ఒడిశాకు చెందిన శిల్పకళాకారులను రప్పించి రూ.2 కోట్ల మేర వెచ్చించి పూర్వకళాకృతిలో ఆలయాన్ని పునర్నిర్మించారు. అనంతరం చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో 2010 ఫిబ్రవరి 5న స్వామివారి బ్రహ్మోత్సవాలు పున:ప్రారంభమయ్యాయి. 

కార్యక్రమాలు ఇలా...

పుష్కర బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆంజనేయస్వామి అభిషేక మహోత్సవం, అలంకారం, అర్చన, సుందరాకాండ, విష్ణు సహస్రనామ పారాయణం, సాయంత్రం 4గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 2న ఉదయం 9గంటలకు స్వామివారికి అభిషేకం, అలంకారం, అర్చనలు, జీయర్‌స్వామి అనుగ్రహ భాషణం, లక్ష్మీపూజ, 3న యాగశాలలో అగ్నిప్రతిష్ఠ, హోమాలు, పారాయణాలు, విశేష గరుడపూజ, 11 గంటలకు హనుమంతుసేవలో వాసుదేవస్వామి వేదిక, రామపూజ, రాత్రికి దేవతా ఆవాహనం, మందస పురవీధుల్లో వాహనసేవ నిర్వహించనున్నారు. 4న యాగశాలలో హోమాలు, కల్పవాహన సేవ, హంస, గజ వాహనసేవ,  లక్ష్మీపూజ, 5న ఉదయం యాగశాలలో హోమం, వాసుదేవుని కల్యాణ మహోత్సవం, 6న యాగశాలలో విశేషహోమాలు, పొన్నవాహన సేవ, శ్రీకృష్ణ పూజ, గోపాలసాగరంలో తెప్పోత్సవం, 7న ఉదయం రథోత్సవం, గోపాలసాగరంలో చక్రతీర్థం, ద్వాదశారాధన, పుష్పయాగం, ఉద్వాసన, 8న ఉదయం వాసుదేవ స్వామి అభిషేకం, సప్తావరణం, ఏకాంతసేవ ఉంటుంది. 



Updated Date - 2021-03-01T05:39:03+05:30 IST