5 నుంచి 6 వారాలు పట్టొచ్చు: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్

ABN , First Publish Date - 2020-04-10T21:29:46+05:30 IST

భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో...

5 నుంచి 6 వారాలు పట్టొచ్చు: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని.. అయితే మన దేశంలో లాక్‌డౌన్‌ మూడో వారంలోకి అడుగుపెట్టిందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని గమనిస్తే పరిస్థితి అదుపులోకి రావడానికి ఇంకా 5 నుంచి 6 వారాలు పట్టే అవకాశముందని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు.


రాబోయే గడ్డు పరిస్థితులను ఎదుర్కొని తట్టుకునేందుకు భారతీయులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో ఉన్న కరోనా తీవ్రత.. అక్కడి పరిస్థితులు మన దేశ ప్రజలకు ఎదురుకాకూడదని హర్షవర్ధన్ ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా మరిన్ని క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ బెడ్స్, ల్యాబ్స్, టెస్టింగ్ కిట్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం మరిన్ని రోజుల లాక్‌డౌన్‌ అమలుకు సిద్ధంగా ఉందని, అందుకే పరిస్థితి సాధారణ స్థిితికి రావాలంటే 5 నుంచి 6 వారాలు పట్టే అవకాశముందని హర్షవర్ధన్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారని జాతీయ మీడియా అభిప్రాయపడింది.

Updated Date - 2020-04-10T21:29:46+05:30 IST