ఏ కేసులతో సంబంధం లేదని నిరూపించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-20T05:23:30+05:30 IST

అధికారంలో ఉన్న తన ప్రభుత్వాన్ని ఒప్పించుకొని సీబీఐ విచారణ చేయించుకొని తాను ఏ కేసులతో సంబంధం లేదని పెద్దప ల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు నిరూపిం చుకోవాలని కాంగ్రెస్‌ నేతలు ప్రతి సవాల్‌ విసిరారు.

ఏ కేసులతో సంబంధం లేదని నిరూపించుకోవాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకుడు సెగ్గెం రాజేష్‌

- జడ్పీ చైర్మన్‌కు కాంగ్రెస్‌ నేతల ప్రతి సవాల్‌

మంథని, ఆగస్టు 19: అధికారంలో ఉన్న తన ప్రభుత్వాన్ని ఒప్పించుకొని సీబీఐ విచారణ చేయించుకొని తాను ఏ కేసులతో సంబంధం లేదని పెద్దప ల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు నిరూపిం చుకోవాలని కాంగ్రెస్‌ నేతలు ప్రతి సవాల్‌ విసిరారు. స్థానిక అంబేద్కర్‌ చౌక్‌లో సెగ్గెం రాజేష్‌, శశిభూషణ్‌కాచే, వొడ్నాల శ్రీనివాస్‌, జంజర్ల శేఖర్‌లు విలేకరులతో మాట్లాడుతూ.. గుండా నాగరాజు మృతినుంచి గట్టు వామన్‌ రావు హత్య, నేటి చీకోటి వ్యవహారం వరకు తనకు సంబంధం లేదని చెప్పి న పుట్ట మధు వాటిని ప్రభుత్వం ద్వా రా విచారణ జరిపించి నిరూపించుకోవాలన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై పుట్ట మధు చేసిన ఆరోపణలను ఖండించా రు. న్యాయవాదులు గట్టు దంపతుల హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. కులాల పేరు చెప్పుకొని మళ్లీ ఎమ్మెల్యే కావాలని చూస్తున్నాడన్నారు. బ్రాహ్మణులను కిం చపర్చే విధంగా మాట్లాడుతున్నాడన్నారు. ప్రజలకు, ప్రభు త్వానికి వారధిగా ఉండే మీడియా వ్యవస్థపై చేసిన వ్యాఖ్య లకు క్షమాపణ చెప్పాలన్నారు. మీడియా సంస్థలను తిట్ట కుండా వాటిలో ఏవైనా లోపాలుంటే కోర్టును ఆశ్రయించాల న్నారు. ఈ కార్యక్రమంలో నూకల బానయ్య, మూల సరోజ న, మద్దెల రాజయ్య, మంథని సత్యం, కుడుదుల వెంకన్న, తోట చంద్ర య్య, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T05:23:30+05:30 IST