విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా చూడాలి

ABN , First Publish Date - 2022-07-06T06:02:07+05:30 IST

ప్రభుత్వ వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకులం పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులు నిర్వహణ సమయంలో

విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా చూడాలి
ఏకలవ్య గురుకులంలో సమస్యలు తెలుసుకుంటున్న పీవో వరుణ్‌ రెడ్డి

ఉట్నూర్‌ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి

ఇంద్రవెల్లి, జూలై 5: ప్రభుత్వ వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకులం పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులు నిర్వహణ సమయంలో విద్యార్థులు బయట ఉండటంతో ఉపాద్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గదిని పరిశీలించారు. ఉదయం వండిన అల్పాహరం నాసిరకంగా ఉండడంతో అసం తృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. ఉపా ధ్యాయుల హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుం డా ఉపాద్యాయులు సెలవు పెట్టరాదన్నారు. ప్రతీ రోజు సమయపాలన పాటించి విఽధులు నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. విద్యార్థులపై నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇందలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - 2022-07-06T06:02:07+05:30 IST