టీ20 వరల్డ్ కప్.. వాయిదా వేయడమే మంచిది: వసీం అక్రమ్

ABN , First Publish Date - 2020-06-06T04:18:35+05:30 IST

కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో క్రికెట్ ఒకటి.

టీ20 వరల్డ్ కప్.. వాయిదా వేయడమే మంచిది: వసీం అక్రమ్

ఇస్లామాబాద్: కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో క్రికెట్ ఒకటి. ఈ క్రమంలో షెడ్యూల్ తప్పకుండా పురుషుల టీ20 ప్రపంచకప్ నిర్వహించాలంటే.. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే ఆడాల్సి రావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనను పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ వ్యతిరేకించాడు. ‘ప్రపంచకప్ అంటేనే ప్రేక్షకులు, హడావుడి, కోలాహలం. అలాంటివేమీ లేకుంటే అది వరల్డ్ కప్ అవదు. ఆ అనుభూతి ఖాళీ స్టేడియాల్లో రాదు’ అని వసీం అభిప్రాయపడ్డాడు. కావాలంటే పరిస్థితులు చక్కబడిన తర్వాతే సిరీస్ నిర్వహించాలని సూచించాడు.

Updated Date - 2020-06-06T04:18:35+05:30 IST