రూ.73,788 కోట్లు తగ్గిన ఐటీ వసూళ్లు

ABN , First Publish Date - 2020-09-17T06:20:54+05:30 IST

రెండో త్రైమాసికంలోనూ ఆదాయ పన్ను వసూళ్లు పడకేశాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రూ.73,788 కోట్లు (22.5 శాతం) తక్కువ...

రూ.73,788 కోట్లు తగ్గిన ఐటీ వసూళ్లు

ముంబై: రెండో త్రైమాసికంలోనూ ఆదాయ పన్ను వసూళ్లు పడకేశాయి. ఈ నెల 15  నాటికి వ్యక్తిగత, కార్పొరేట్‌ ఆదాయ పన్ను వసూళ్లు, ముందస్తు పన్ను చెల్లింపులు రూ.2,53,532 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రూ.73,788 కోట్లు (22.5 శాతం) తక్కువ. అయితే ఇవి తాత్కాలిక అంచనాలని, పన్ను వసూళ్ల వివరాల్ని బ్యాంకులు ఇంకా అప్‌డేట్‌ చేయాల్సి ఉందని ఐటీ అధికారులు చెప్పారు. అయితే జూలై 1- సెప్టెంబరు 15 మధ్య కాలంలో ఆదాయ పన్ను వసూళ్లు ఎంత, ముందస్తు పన్ను చెల్లింపులు ఎంత? అనే వివరాలు ఇంకా అందాల్సి ఉంది. తొలి త్రైమాసికంలోనూ ఆదాయ పన్ను వసూళ్లు 31 శాతం పడిపోయాయి. 

Updated Date - 2020-09-17T06:20:54+05:30 IST