మరో రెండు రోజులు వర్షాలే

ABN , First Publish Date - 2020-09-20T07:38:21+05:30 IST

రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

మరో రెండు రోజులు వర్షాలే

రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి.

తూర్పు-పశ్చిమ షియర్‌ జోన్‌  ఉత్తర దిశగా దేశం మీదుగా 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 

Updated Date - 2020-09-20T07:38:21+05:30 IST