టెకీలకు డిమాండ్.. శాలరీల్లో భారీ పెరుగుదల!

ABN , First Publish Date - 2021-07-14T02:44:38+05:30 IST

కరోనా సంక్షోభం ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులు తెచ్చింది. భౌతిక దూరం తప్పనిసరిగా మారిన ప్రస్తుత పరిస్థితిలో అంతా ఆన్‌లైన్ మయమైపోయింది. ఈ క్రమంలో..

టెకీలకు డిమాండ్.. శాలరీల్లో భారీ పెరుగుదల!

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులు తెచ్చింది. భౌతిక దూరం తప్పనిసరిగా మారిన ప్రస్తుత పరిస్థితిలో అంతా ఆన్‌లైన్ మయమైపోయింది. కంపెనీలన్నీ తమ కార్యకలాపాలను డిజిటల్ వేదికల ద్వారా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ నిపుణులకు భారీ డిమాండ్ పెరిగిందని ఏబీసీ కన్సల్టెంట్స్, క్వెస్ వంటి రిక్రూటింగ్ సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగంలో చేరేందుకు టెకీలు తమ జీతంలో 50 నుంచి 70 శాతం పెంపును ఆశిస్తున్నారని ఈ సంస్థలు చెబుతున్నాయి. కొవిడ్‌కు మునుపు ఉద్యోగం మారేందుకు టెకీలు కేవలం 13 నుంచి 15 శాతం ఇంక్రిమెంట్ మాత్రమే ఆశించేవారట. సాస్, ఎడ్‌టెక్, హెల్త్ టెక్, గేమింగ్, కృత్రిమమేధ, ఆటోమేషన్, బ్లాక్ చెయిన్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లోని నిపుణులకు భారీ డిమాండ్ ఉందని రిక్రూటింగ్ సంస్థలు తెలిపాయి. 

Updated Date - 2021-07-14T02:44:38+05:30 IST