అంబేడ్కర్‌ పేరు వివాదాస్పదం చేయడం విచారకరం

ABN , First Publish Date - 2022-05-28T05:53:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కోనసీమ జిల్లాకు బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వివాదాస్పదం చేయడం విచారకరమని కుల వివక్ష పోరాట

అంబేడ్కర్‌ పేరు వివాదాస్పదం చేయడం విచారకరం
నెమ్మికల్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్‌ నాయకుల నిరసన

సూర్యాపేట కల్చరల్‌ / ఆత్మ కూర్‌(ఎస్‌),  మే 27 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కోనసీమ జిల్లాకు బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వివాదాస్పదం చేయడం విచారకరమని కుల వివక్ష పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు. జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్‌లో శుక్రవారం నిరసన వ్యక్తం చేసి, మాట్లాడారు. ఉన్మాదకుట్రలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారావు, జహంగీర్‌, మామిడి సుందరయ్య, ధనమూర్తి, లింగయ్య, పుల్లయ్య పాల్గొన్నారు.  అదేవిధంగా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామంలోని అంబ్కేడర్‌ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు మేడి కృష్ణ, నాయకులు నవిలే లింగరాజు, రేణుక, అనిత, కళమ్మ, నిర్మల రజిత, ఉపేంద్ర, సునీత  పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:53:08+05:30 IST