తమిళనాడులోని కుర్రాళ్లకు కొత్త కష్టం.. ఆ ఒక్క కారణం వల్లే 30 ఏళ్ల వయసు దాటినా 40 వేల మందికి పెళ్లి కావడం లేదట..!

ABN , First Publish Date - 2021-11-19T00:41:53+05:30 IST

తమిళనాడు పాట్నాలోని 40,000 మంది బ్రాహ్మణ యువకులకు వివాహాలు జరగడం కష్టంగా ఉందట. దీంతో తమిళనాడుకు చెందిన బ్రాహ్మణ సంఘం.. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ వధువులను కనుగొనడానికి

తమిళనాడులోని కుర్రాళ్లకు కొత్త కష్టం.. ఆ ఒక్క కారణం వల్లే 30 ఏళ్ల వయసు దాటినా 40 వేల మందికి పెళ్లి కావడం లేదట..!
ప్రతీకాత్మక చిత్రం

కొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లిళ్లు అవడం కష్టంగా ఉంటుంది. తమిళనాడులోని 40వేల మంది బ్రాహ్మణ యువకులకు ఇలాంటి కష్టమే వచ్చింది. 30 ఏళ్ల వయసు దాటుతున్నా.. వధువు దొరకడం కష్టంగా మారిందట. దీంతో పక్క రాష్ట్రాల్లో వధువులను వెతికే పనిలో పడ్డారట. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారట. వివరాల్లోకి వెళితే..


తమిళనాడు పాట్నాలోని 40,000 మంది బ్రాహ్మణ యువకులకు వివాహాలు జరగడం కష్టంగా ఉందట. దీంతో తమిళనాడుకు చెందిన బ్రాహ్మణ సంఘం.. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ వధువులను కనుగొనడానికి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని తమిళనాడు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఎన్.నారాయణన్.. ఓ మాసపత్రికలో చర్చించారు. పది మంది అబ్బాయిలకు కేవలం ఆరు మంది మాత్రమే యువతులు ఉన్నారని తెలిపారు. ఢిల్లీతో పాటు, పాట్నా, లక్నోలో సమన్వయకర్తలను నియమించి వధువులను వెతికే పనిలో ఉన్నట్లు చెప్పారు.


విద్యావేత్త ఎం.పరమేశ్వరన్ అభిప్రాయం ప్రకారం, పెళ్లి సమయంలో అయ్యే లక్షల రూపాయల ఖర్చు విషయంలో చాలా మంది పేద బ్రాహ్మణులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తమ కుమార్తెల పెళ్లిళ్లకు డబ్బులు సమకూర్చుకోవడంలో అవస్థలు పడుతున్నారు. నగలు, కళ్యాణ మండపం అద్దె, భోజనం తదితరాల ఖర్చులు చాలా పెరిగిపోయాయని చెప్పారు. పెళ్లిళ్ల విషయంలో ఆడంబరాలకు పోకుండా రాజీ పడితే.. సమస్య ఉండదని పరమేశ్వరన్ తెలిపారు.  పెళ్లి సంబంధం కోసం ప్రయత్నిస్తున్న అజయ్ అనే యువకుడు మాట్లాడుతూ తమిళులకు.. తెలుగు, కన్నడ భాషలు మాట్లాడే సంబంధాలు దొరకడం చాలా కష్టమని చెప్పారు. అయితే ఉత్తర భారతీయ, తమిళ బ్రాహ్మణుల మధ్య పరస్పర అంగీకారంతో వివాహాలు జరగడం సర్వసాధారణమని చెబుతున్నారు.

Updated Date - 2021-11-19T00:41:53+05:30 IST