Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమ్మెపై ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరం

- వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, డిసెంబరు 8: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ కోల్‌బెల్ట్‌ ప్రజాప్రతినిధులు స్పం దించకపోవడం బాధకరమని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల ఓట్లతో గెలిచిన ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాల్లో సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మాట్లాడకపోవడం విచారకరమని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రాంతంలోని బొగ్గు గనులు ప్రైవేటీకరణ కాకుండా వారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి  కాపాడుకుంటున్నారన్నారు.  కానీ సీఎం     కేసీఆర్‌, ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఓపెన్‌ టెండర్‌ ప్రక్రియ ద్వారా ఆదేశాలు జారీ చేసిందన్నారు. రెండు సార్లు ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జేఏసీ చర్చలు జరిపినా విఫలమయ్యాయని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ నెల 13న జరిగే వేలం పాటల్లో నాలుగు బొగ్గు బ్లాకులు ప్రైవేట్‌ వారికి వెళ్లే అవకాశం ఉందని, దీనిని అడ్డుకోవడానికే మూడు రోజులు సమ్మె పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. సింగరేణిపై స్పందించని ప్రజాప్రతినిధులు గనులపైకి   వస్తే కార్మికవర్గం తరిమికొడుతుందని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మేరుగు రాజయ్య, మడ్డి ఎల్లయ్య, గౌతం గోవర్ధన్‌, కనకరాజు, గోషిక మోహన్‌, రమేష్‌కుమార్‌, రాజయ్య, చంద్రశేఖర్‌, గొడిశెల నరేష్‌, రేణికుంట్ల ప్రీతం, మల్లేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement