పొలంలో మట్టి తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం లభ్యమైనట్టు ప్రచారం!

ABN , First Publish Date - 2021-12-04T06:17:34+05:30 IST

మునిసి పాలిటీ పరిధి బయపురెడ్డిపాలెం- కశిమి రోడ్డులో గల ఏపీ టిడ్కో గృహాలు దాటిన తర్వాత ఓ పంట పొలంలోని తవ్వకాల్లో అమ్మవారి పంచలోహ విగ్రహం బయట పడిందని గురువారం విస్తృతంగా ప్రచారం జరిగింది.

పొలంలో మట్టి తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం లభ్యమైనట్టు ప్రచారం!
పూజలు అందుకుంటున్న అమ్మవారి విగ్రహం

నర్సీపట్నం, డిసెంబరు 3 : మునిసి పాలిటీ పరిధి బయపురెడ్డిపాలెం- కశిమి రోడ్డులో గల ఏపీ టిడ్కో గృహాలు దాటిన తర్వాత ఓ పంట పొలంలోని తవ్వకాల్లో అమ్మవారి పంచలోహ విగ్రహం బయట పడిందని గురువారం విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇది తవ్వకాల్లో బయటపడిన విగ్రహం కాదని, ఉద్దేశపూర్వంగా ప్రతిష్ఠించి ఉంటారని పలువురు చర్చిం చుకుంటున్నారు. ఇది తెలుసుకున్న ‘ఆంధ్ర జ్యోతి’ శుక్రవారం అక్కడికి వెళ్లి ఆరా తీయగా.. ఇది బయపురెడ్డిపాలేనికి చెం దిన అనిమిరెడ్డి నాయుడుకు చెందిన పొలమని, అమ్మవారు ఒకరిపై వాలి చెప్పిన చోట తవ్వడంతో విగ్రహం బయట పడిందని నిర్వాహకులు తెలిపారు.  తవ్వకాల్లో అమ్మవారి బంగారం విగ్రహం బయట పడిందని పుకార్లు షికార్లు చేయడంతో తిలకించేందుకు జనం క్యూ కడుతున్నారు. 

Updated Date - 2021-12-04T06:17:34+05:30 IST