జనసేన నేతలతో టచ్‌లో ఉన్నాననడం హాస్యాస్పదం

ABN , First Publish Date - 2022-08-11T05:47:31+05:30 IST

జనసేన పా ర్టీ నేతలతో తాను టచ్‌లో ఉన్నానని, ఆ పార్టీలోకి వెళతానంటూ దుష్ప్రచారం చేయడం హాస్యాస్ప దంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల పవన్‌కళ్యాణ్‌ చేనేతకు సంబంధించి ట్వీ ట్‌ చేసిన చాలెంజ్‌కు తాను, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు స్పందించామని తెలిపారు.

జనసేన నేతలతో టచ్‌లో ఉన్నాననడం హాస్యాస్పదం

రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌ వెంటనే.. 

ఎంపీ గోరంట్ల విషయంలో త ప్పు ఉంటే ఉపేక్షించం 

మాజీ మంత్రి బాలినేని వెల్లడి 


ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 10: జనసేన పా ర్టీ నేతలతో తాను టచ్‌లో ఉన్నానని, ఆ పార్టీలోకి వెళతానంటూ దుష్ప్రచారం చేయడం హాస్యాస్ప దంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల పవన్‌కళ్యాణ్‌ చేనేతకు సంబంధించి ట్వీ ట్‌ చేసిన చాలెంజ్‌కు తాను, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు స్పందించామని తెలిపారు. ఒంగోలులో లాయర్‌పేటలోని బాలినేని నివాసంలో బుధవా రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నంత కా లం వైసీపీలోనే ఉంటానని తెలిపారు. తాను ఎ మ్మెల్యే అయ్యానంటే వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పెట్టిన భిక్షేనన్నారు. ఇటీవలకాలంలో తనపై పలురకాలు గా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్‌ కుటుం బానికి విధేయునిగానే ఉంటానే తప్ప పార్టీ మా రే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. ప్రతి విష యాన్ని తనపై రుద్దేందుకు ప్రయత్నాలు చేయ డం తగదన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన అం శాలపై అక్కడి ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆ పార్టీ నాయకులతో సమావేశమయ్యానని తెలి పారు. ఈ సమావేశాన్ని కూడా వక్రీకరించి తా ను పార్టీ మారుతున్నట్లు చెప్పడం దారుణమన్నా రు. గిద్దలూరు నియోజకవర్గంలో మండలాల వా రీగా నాయకులు, ఎమ్మెల్యే రాంబాబుతో చర్చిం చామన్నారు. రెండురోజుల్లో ఆ నియోజకవర్గంలో గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. పార్టీలో నెలకొన్న అంత ర్గత విషయాలపై చర్చిస్తే తాను పార్టీ మారేం దుకు అనుచరులతో సమావేశమయ్యాయని ప్ర చారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఊసర వెల్లి రాజకీయాలు చేసే మనస్తత్వం తనకు లే దని స్పష్టం చేశారు. కష్టనష్టాల్లో జగన్‌ వెంటే న డిచానని, తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆ యన వెంటే నడుస్తానని తెలిపారు. సీఎం జగ న్మోహన్‌రెడ్డి 22 నియోజకవర్గాల బాధ్యతలను త నకు అప్పగించారని, వాటిల్లో వైసీపీ గెలుపే ల క్ష్యంగా పనిచేస్తానని బాలినేని స్పష్టం చేశారు. హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వచ్చిన అంశంపై సీఎం సీరియస్‌గా తీసుకున్నారని తె లిపారు. గోరంట్లపై తప్పు ఉంటే తప్పకుండా చ ర్యలు తీసుకుంటారని తెలిపారు. ఒకవేళ వీడి యోను మార్పింగ్‌ చేసి ఉంటే వారిపై కూడా చ ర్యలు తీసుకుంటారని బాలినేని తెలిపారు. 

Updated Date - 2022-08-11T05:47:31+05:30 IST