Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్మికులను చిన్నచూపు చూడడం బాధాకరం

వేంపల్లె, డిసెంబరు 5: భవన నిర్మాణ కార్మికులను చిన్నచూపు చూడటం బాధాకరమని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పఠాన్‌ టోపీవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వేంపల్లెలో జీటీ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల నుంచి కార్మికులకు ఏ సహాయమూ అందడం లేదన్నా రు. కార్మికులకు క్లెయింలు ఒకటి కూడా కాలేదన్నారు. సంక్షేమ బోర్డులోని డబ్బు పక్కదోవ పట్టించి కార్మికులకు అన్యా యం చేస్తున్నారన్నారు. గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.20 వేలు వేయాలని ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదన్నారు. ఆటోడ్రైవర్లకు, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.10వేల చొప్పున చేస్తున్నారన్నారు. మా సంక్షేమ బోర్డులోని డబ్బులు మాకు ఇవ్వమంటే మా డబ్బు తీసుకుపోయి ఇతరులకు దానం చేస్తున్నారన్నారు. కావున భవన నిర్మాణ కార్మిక సమస్యలపై స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక మండల కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement