వరి సాగు చేయొద్దని ఆదేశించడం సరికాదు

ABN , First Publish Date - 2021-10-28T06:09:45+05:30 IST

యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులను ప్రభుత్వం ఆదేశించడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి అన్నారు. వలిగొండలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు.

వరి సాగు చేయొద్దని ఆదేశించడం సరికాదు
వలిగొండలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

వలిగొండ, అక్టోబరు 27: యాసంగిలో వరి సాగు చేయొద్దని  రైతులను ప్రభుత్వం ఆదేశించడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి అన్నారు. వలిగొండలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా పంటల సాగుపై ఆంక్షలు విధించలేదన్నారు. యాసంగిలో వరి మినహా ఇతర పంటలు పండవనే విషయం పాలకులకు తెలియకపోవడం విడ్డూరమ న్నారు. ఒక్క ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయదని మంత్రి జగదీష్‌రెడ్డి ప్రకటించడం దారుణమన్నారు. వరి సాగుపై సీఎం కేసీఆర్‌  నోరు మెదపకుండాకలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో విత్తన డీలర్లను కట్టడి చేయడం సరైన పద్ధతా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని, ప్రజలపై ప్రభు త్వం అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. అవసరానికి మించి ప్రాజెక్టులను కేవలం తన కమిషన్‌ కోసమే నిర్మించి, వరిని సాగు  చేయొ ద్దనడం సరైన విధానం కాదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుదన్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.  రైతులపై ప్రభుత్వ ఆంక్షలు సరికాదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ ఎంపీపీ తుమ్మల నర్సయ్య, నాయకులు బోళ్ల శ్రీనివాస్‌, కొమురయ్య, రాజు, రసూల్‌, గరిసె రవి, నర్సింహారెడ్డి, లింగయ్య, ఖుర్షిద్‌, కాసుల వెంకటేశం, పాలకూర్ల వెంకటేశం, బత్తిని పాండు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-28T06:09:45+05:30 IST