నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు..

ABN , First Publish Date - 2022-08-19T05:36:13+05:30 IST

ఇప్పటి వరకు తనపై వచ్చిన ఆరోపణల్లో ఏఒకదాం ట్లోనైనా తాను తప్పు చేసినట్లు మీడి యా నిరూపిస్తే మంథని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉరి వేసుకుంటానని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు..
మాట్లాడుతున్న పుట్ట మధు

- తప్పు చేసినట్లు నిరూపిస్తే అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉరి వేసుకుంటా.. 

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు 

మంథని, ఆగస్టు 18: ఇప్పటి వరకు తనపై వచ్చిన ఆరోపణల్లో ఏఒకదాం ట్లోనైనా తాను తప్పు చేసినట్లు మీడి యా నిరూపిస్తే మంథని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉరి వేసుకుంటానని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంథని అంబేద్కర్‌ చౌక్‌లో పుట్ట మధు గురువారం రోడ్డు పై బైఠాయించి మీడియాలో తనపై ప్రచారమవుతున్న నిరాధారమైన ఆరో పణలను ఖండించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మంథని ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు జరిగిన మంథని మధూకర్‌ మృతి కేసుతో పా టు ఇటీవల వెలుగుచూసిన చీకోటి ప్రవీణ్‌ వ్యవహారం వర కు ఏఒక్క సంఘనటలోనైనా తన ప్రమేయమున్నట్లు నిరూ పిస్తే ఉరి వేసుకుంటానన్నారు. గతంలో మంథని మధూకర్‌ మృతి కేసు, శీలం రంగయ్య మృతి, తాను అక్రమంగా 900 కోట్లు సంపాదించినట్లు, న్యాయవాదుల హత్య కేసు, తాజా గా చీకోటి ప్రవీణ్‌ క్యాసినోవా కేసు.. ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌, సోషల్‌ మీడియా లు తనకు ఆపాదిస్తూ ప్రజల్లో తనను చెడ్డవాడిగా చిత్రీక రించే కుట్రలు చేస్తున్నాయన్నారు. ఎలాంటి దర్యాప్తు సంస్థ లతోనైనా, లేదా మీడియా సొంతగానైనా ఇన్వెస్టిగేషన్‌ చేసి తనపై వచ్చిన ఆరోపణల్లో తాను ఒక్క కేసులోనైనా తప్పు చేసినట్లు నిరూపించాలని సవాల్‌ చేశారు. నియోజకవర్గం లో ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని ప్రశ్నించినందుకే, బ్రాహ్మణి జాన్ని వ్యతిరేకించినందుకే తాను అవినీతి, అక్రమాలకు పా ల్పడుతున్నట్లు మీడియా సంస్థలు కుట్రపూరితంగా కథనా లు ప్రచురిస్తున్నాయన్నారు. తనపై మీడియాలో వచ్చే నిరా ధారమైన ఆరోపణలు, ప్రచారం వెనుక మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. కార్యక్రమం లో భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, జడ్పీటీసీ తగరం సుమ లత, ఎంపీపీ కొండ శంకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీని వాస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు తగరం శంకర్‌లాల్‌, ఏగోళపు శంక ర్‌గౌడ్‌, పూదరి సత్యనారాయణ, భూపెల్లి రాజు, బత్తుల స త్యనారాయణ, ఎక్కేటి అనంతరెడ్డిలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:36:13+05:30 IST