డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీలు పెంచడం తగదు

ABN , First Publish Date - 2022-07-04T05:24:16+05:30 IST

డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచడం తగదని వెంటనే చార్జీల పెంపు ఉపసంహరించాలని మండల టీడీపీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీలు పెంచడం తగదు
ములకలచెరువులో రాస్తారోకో నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

ములకలచెరువు, జులై 3: డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచడం తగదని వెంటనే చార్జీల పెంపు ఉపసంహరించాలని  మండల టీడీపీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆదివారం ముంబాయి- చెన్నై జాతీయ రహదారి లోని ములకలచెరువులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన మూడేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి పేద ప్రజలపై పెనుభారాన్ని మోపిందన్నారు. బాదుడు ప్రభుత్వానికి చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పెరిగిన కరెంటు, ఆర్టీసీ, నిత్యవసర ధరల కారణంగా పేద, మధ్య తరగతి కుటంబాల బతుకు భారంగా మారిందన్నారు.  కార్యక్రమంలో రాజంపేట నియోజక వర్గ బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ముత్తుకూరు మౌలా, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ కేవీ రమణ, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు చెన్నకిష్టా, మండల తెలుగు యువత అధ్యక్షుడు జేసీబీ సుధాకర్‌నాయు డు, బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌, మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, నాయకులు నాగరాజు యాదవ్‌, కట్టా హరినాధ్‌, కాల మహేష్‌, రెడ్డెప్ప, భజంత్రి రామాంజులు, విజయ్‌కుమార్‌, నాగమల్లప్ప, షామీర్‌, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. 

చార్జీల పెంపుతో పేదలపై మరింత భారం

తంబళ్లపల్లె, జూలై 3: ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..ఈ తరుణంలో రాష్ట్ర ప్రభు త్వం మరోసారి ఆర్టీసీ చార్జీలు పెంచి పేదవాడిపై మరింత భారం మోపుతోందని తంబళ్లపల్లె టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఆదివారం టీడీపీ నాయకులు మండల కేంద్రంలోని సిద్దారెడ్డిగారిపల్లెలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుకు వ్యతిరేకంగా నిరసన  చేపట్టారు. పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీల తగ్గించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్న పళంగా బస్సు చార్జీల ను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు వైసీపీ అనుసరిస్తు న్న ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికలలో టీడీపీకి ఓటు వేసి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, తెలుగు యువత నాయకులు నరసింహులు, మధుసూధన్‌, గంగరాజు, మాజీ జడ్పీటీసీ రామచంద్ర, మాజీ సర్పంచ్‌లు ఉత్తమ్‌రెడ్డి, బేరి శీన, రామ్మోహన, మ్యూజికల్‌ శివ, వెంకట్రమణ, అశోక్‌, మధన్‌మోహన్‌ తదితర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-04T05:24:16+05:30 IST