నజరానా ఎప్పుడో.. ?

ABN , First Publish Date - 2021-02-25T05:33:03+05:30 IST

గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు లేకుండా ప్రజలంతా చర్చించుకుని ఏకగ్రీవం చేసుకుంటే జనాభాను బట్టి రూ.5 లక్షల నుంచి 20 లక్షలు ప్రోత్సాహక అవార్డు (నజరానా) ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాలో 806 గ్రామ పంచాయతీలు ఉంటే 793 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఇస్తామన్న నజరానాతో గ్రామాభివృద్ధి చేసుకోవచ్చనో..

నజరానా ఎప్పుడో.. ?

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వ అవార్డు 

జిల్లాలో 258 పంచాయతీలు ఏకగ్రీవం

రూ.20.65 కోట్లు అవసరమని అంచనా

(కడప-ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు లేకుండా ప్రజలంతా చర్చించుకుని ఏకగ్రీవం చేసుకుంటే జనాభాను బట్టి రూ.5 లక్షల నుంచి 20 లక్షలు ప్రోత్సాహక అవార్డు (నజరానా) ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాలో 806 గ్రామ పంచాయతీలు ఉంటే 793 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఇస్తామన్న నజరానాతో గ్రామాభివృద్ధి చేసుకోవచ్చనో.. రాజకీయ ఒత్తిళ్లో.. మరే ఇతర కారణమో జిల్లాలో 258 పంచాయతీలు ఎన్నికలు లేకుండా సర్పంచిలతో సహా మొత్తం వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ప్రభుత్వం గ్రామ జనాభాను బట్టి నాలుగు కేటగిరీలుగా విభజించి ప్రోత్సాహకం ప్రకటించింది. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీకి రూ.5 లక్షలు, 2-5 లక్షల మధ్య జనాభా ఉంటే రూ.10 లక్షలు, 5-10 లక్షల మధ్య ఉంటే రూ.15 లక్షలు, 10 వేలు కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.20 వేలు ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. పది నియోజకవర్గాల పరిధిలో సుమారుగా కేటగిరీ-1 కింద 141 పంచాయతీలకు రూ.7.05 కోట్లు, కేటగిరీ-2 కింద 77 పంచాయతీలకు రూ.10 లక్షల ప్రకారం రూ.7.70 కోట్లు, కేటగిరీ-3 కింద 39 పంచాయతీలకు రూ.15 లక్షల ప్రకారం రూ.5.70 కోట్లు, కేటగిరీ-4 కింద ఒక పంచాయతీకి రూ.20 లక్షలు కలిపి రూ.20.65 కోట్లు ప్రోత్సాహకం వచ్చే అవకాశం ఉందని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. అయితే.. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కాగా.. 2011 జనాభా గణాంకాల ప్రకారం ప్రతిపాదనలు పంపాం. తాజా జనాభా మేరకు పంపాలా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ఉత్తర్వులు రాగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు పంపుతామని డీపీవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-02-25T05:33:03+05:30 IST