అది చైనా వైరసే

ABN , First Publish Date - 2020-05-23T08:29:50+05:30 IST

మహమ్మారి కరోనా వైరస్‌ చైనా నుంచే వచ్చిందని, దీన్ని అగ్రరాజ్యం ఏమంత తేలిగ్గా తీసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘‘ఇది (కరోనావైరస్‌) చైనా నుంచి వచ్చింది. దీని పట్ల మేము సంతోషంగా లేము. మేము ఒక వాణిజ్య ఒప్పందం...

అది చైనా వైరసే

  • దీన్ని తేలిగ్గా తీసుకోం: ట్రంప్‌


వాషింగ్టన్‌, మే 22: మహమ్మారి కరోనా వైరస్‌ చైనా నుంచే వచ్చిందని, దీన్ని అగ్రరాజ్యం ఏమంత తేలిగ్గా తీసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘‘ఇది (కరోనావైరస్‌) చైనా నుంచి వచ్చింది. దీని పట్ల మేము సంతోషంగా లేము. మేము ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ సిరా ఇంకా ఆరనే లేదు. ఒక్కసారిగా ఇది లోపలికి వచ్చింది. దీన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు’’ అని మిచిగాన్‌లో జరిగిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ నాయకుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్‌ పేర్కొన్నారు.


కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో చైనా ఘోరంగా విఫలమైనట్టు ట్రంప్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే చైనాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నది మాత్రం ట్రంప్‌ వెల్లడించడం లేదు.


కరోనా వ్యాప్తి నేపథ్యంలో ట్రంప్‌ ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. మరోవైపు అమెరికా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పరిశోధనను చైనా దొంగిలించకుండా ఉండేందుకు వీలుకల్పించే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రక్షణ చట్టాన్ని తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందిన అమెరికన్ల స్మారకార్ధం అన్ని ఫెడరల్‌ బిల్డింగ్‌లు, జాతీయ స్మారక కట్టడాలపై అమెరికా జాతీయ పతాకాన్ని 3 రోజుల పాటు అవనతం చేయనున్నట్టు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-05-23T08:29:50+05:30 IST