దొంగల్లా వచ్చి కూల్చివేయడం దారుణం

ABN , First Publish Date - 2021-10-25T06:10:03+05:30 IST

పట్టణంలోని కాయగూరల మార్కెట్‌ను దొంగల్లా శనివారం అర్ధరాత్రివచ్చి కూల్చడం అరాచకమని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ మండిపడ్డారు.

దొంగల్లా వచ్చి కూల్చివేయడం దారుణం

-అభివృద్ధికి కాదు...అరాచకానికి వ్యతిరేకం

-వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలి..

-ఎమ్మెల్యే ఖబడ్దార్‌...ప్రజలు మట్టిలో తొక్కే రోజులు దగ్గరపడ్డాయి..

-కూల్చివేతలను పరిశీలించిన బీకే, పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, అక్టోబరు 24: పట్టణంలోని కాయగూరల మార్కెట్‌ను దొంగల్లా శనివారం అర్ధరాత్రివచ్చి కూల్చడం అరాచకమని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ మండిపడ్డారు. కూర గాయల మార్కెట్‌ మున్సిపల్‌ అధికారులు పోలీసుల పహారాలో కూల్చివే యశారు. ఈవిషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్‌, బీకేపార్థసారధి, సీపీఎం నాయకులు పోలారామాంజినేయులు, జంగాలపల్లి పెద్దన్న, సీపీఐనాయకులు మధులతో కలిసి ఆదివారం కూల్చివేతలను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపా రులతో వారు మాట్లాడగా..గడువు ఇవ్వమని అడిగిన వినకుండా సరుకంతా నేల పాలు చేసి మమ్మల్ని రోడ్లపాలు చేశారని వారు కన్నీటిపర్వంతమయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్‌ విలేకరులతో మాట్లాడుతూ...రెండు రోజుల క్రితం మార్కెట్‌లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యను జాయింట్‌కలెక్టర్‌ నిశాంత్‌కు మార్‌కు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రజావేదిక ఏర్పాటుచేసి వ్యాపారుల సమస్యను తెలుసుకుని సామరస్యంగా చేయాలని జేసీని అడగడం జరిగిందన్నారు. అయితే అర్ధరాత్రి దొంగల్లా వచ్చి షెడ్లను కూల్చివేసి లక్షలాది రూపాయలు విలువ చేసే సరుకులను నేలపాలు చేశారన్నారు. పెద్దషాపులకు రూ.10లక్షలు, చిన్న షాపులకు రూ.5లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే సోషల్‌ మీడియాలో పోలవరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టుగా మ్యాప్‌ వేసి చూపించడం కాదు, మార్కెట్‌లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకుని న్యాయం చేయాలని హితువపలికారు. నీవు ఇంతవరకు వారితో మాట్లాడలేదని, ఎంత సేపు మార్కెట్‌ను కూల్చడానికి ప్రయత్నిస్తున్నావన్నారు. ఎమ్మెల్యే ఖబడ్దార్‌ ప్రజలు మట్టిలో తొక్కేరోజులు దగ్గరలో ఉన్నాయి దీనిని గుర్తుకుపెట్టుకో అని హె చ్చరించారు. మార్కెట్‌ నిర్మాణం చేపట్టాలనుకున్నప్పుడు నిధులు మంజూరుచేయించి నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కల్గించకుండా వ్యాపారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మేమంత వ్యాపారులకు అండగాఉంటామని, న్యాయంజరిగేవరకు పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతం కాటమయ్య, పురుషోత్తంగౌడ్‌, మేకలరామాంజి నేయులు, చింతపులుసు పెద్దన్న, అంబటిసనత్‌, రాంపురంశీన, భీమనేనిప్రసాద్‌నాయుడు, విజయ సారధిచౌ దరి, పరిశేసుఽధాకర్‌, చిగిచెర్ల రాఘవరెడ్డి, ,డిష్‌లచ్చి,  జమీర్‌అహమ్మద్‌, చీమల రామాంజి, బాబూ ఖాన్‌, చీమలనాగరాజు, చిన్నూరు విజయ్‌, గంగారపురవి, పల్లపు రవి,  కత్తులబాబ్జీ, అశ్వర్థనాయుడు, సాకేకుళ్లాయప్ప, పోతుకుంట రవి, పోతుకుంట రమేశ్‌, సాకేశివయ్య, చికెన్‌ రాము, మారుతీస్వామి, తోటవాసుదేవ, అశోక్‌, బోడగల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-25T06:10:03+05:30 IST