ఎంఎస్ఎం‌ఈలకు నగదు ప్రోత్సాహం ఇవ్వకపోవడం నేరమే: రాహుల్

ABN , First Publish Date - 2020-06-03T02:41:44+05:30 IST

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కి నగదు ప్రోత్సాహం అందించకపోవడం ..

ఎంఎస్ఎం‌ఈలకు నగదు ప్రోత్సాహం ఇవ్వకపోవడం నేరమే: రాహుల్

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కి నగదు ప్రోత్సాహం అందించకపోవడం ‘‘నేరమే’’ అవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశంలో మూడోవంతు ఎంఎస్ఎంఈలు శాశ్వతంగా మూతపడే పరిస్థితికి వచ్చాయని ఆయన ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని విస్తరించిన మరుసటి రోజే ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ఎంఎస్ఎంఈల ద్వారా 11 కోట్ల మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వాటిలో మూడో వంతు శాశ్వతంగా మూతపడుతున్నాయి. వాటికి భారత ప్రభుత్వం వెంటనే నగదు ప్రోత్సాహం అందించకపోతే నేరమే అవుతుంది..’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.


అంతకు ముందు రాహుల్ ట్విటర్లో స్పందిస్తూ... భారత ఆర్ధిక వ్యవస్థను మోదీ నడిపిస్తున్న తీరు ‘‘నామమాత్రంగా’’ మాత్రంగా ఉందంటూ మూడీస్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘పేదలు, ఎంఎస్ఎంఈలకు సాయం అందించకపోతే మున్ముందు మరింత దుర్భర పరిస్థితులు నెలకొనే అవకాశంఉంది...’’ అని రాహుల్ పేర్కొన్నారు. కాగా ఆర్థిక కష్టాల్లో ఉన్న రెండు లక్షల ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రూ.20 వేల కోట్ల సబార్డినేట్‌ రుణాలు అందించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఈ కంపెనీల టర్నోవర్‌ పరిమితిని రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచింది. దీని ద్వారా ఆరు కోట్ల ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుందనీ.. 11 కోట్లీ మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-03T02:41:44+05:30 IST