రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చడం అభినందనీయం

ABN , First Publish Date - 2022-07-03T06:04:58+05:30 IST

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చడం అభినందనీయమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఇం

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చడం అభినందనీయం
సూర్యాపేటలో విద్యార్థులను అభినందిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌, జూలై 2: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చడం అభినందనీయమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం అభినందించారు. జిల్లాకేంద్రానికి చెందిన చామకూరి పద్మ, వెంకటేశ్వర్‌రావు కుమారుడు సోము 470 మార్కుకు గాను 468 మార్కులతో రాష్ట్ర ప్రథమ ర్యాంకు అభినందనీయమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు. విద్యార్థుల చదువులకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడుతుందని తెలిపారు.

అర్వపల్లి: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ అన్నారు. మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10జీపీఏ సాధించిన విద్యార్థులను సన్మా నించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జల్ల ప్రసాద్‌, ఉపసర్పంచ్‌ పులిచర్ల ప్రభాకర్‌, చిల్లంచర్ల విద్యాసాగర్‌, కనుకు శ్రీనివాస్‌, కాప వెంకటేశ్వర్‌రావు, కడారి నరేష్‌, శ్రీరాములు, మల్లారెడ్డి పాల్గొన్నారు. 

మోతె: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని మంచి మార్కులు సాధించడం అభినందనీయమని ఎంఈవో గోపాల్‌రావు అన్నారు. మోతె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో పదవతరగతిలో ప్రతిభ కన బర్చిన చల్లా ఉదయశ్రీ, హలావత్‌ శ్రీలత, దోసపాటి త్రివేణి, బాణోత్‌ శ్రావణిలను సన్మానించారు. 

Updated Date - 2022-07-03T06:04:58+05:30 IST