ముఖ సౌందర్యానికి సూపర్..

ABN , First Publish Date - 2022-09-29T20:36:17+05:30 IST

మన ఇంట్లో ఉండే సహజమైన ఇంగ్రిడియంట్‌ నిమ్మకాయ. ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండని నిమ్మరసాన్ని

ముఖ సౌందర్యానికి సూపర్..

మన ఇంట్లో ఉండే సహజమైన ఇంగ్రిడియంట్‌ నిమ్మకాయ. ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండని నిమ్మరసాన్ని ముఖ సౌందర్యానికి ఉపయోగించుకోవటం ఉత్తమం.


  • నిమ్మరసం ముఖానికి పట్టిస్తే ఇందులోని సిట్రిక్‌ ఆమ్లం వల్ల మంటగా అనిపించినా ముఖంమీద ఉండే మృతకణాలు తొలగిపోతాయి. నొప్పులు తగ్గుతాయి. విటమిన్‌ సి పుష్కలం కాబట్టి స్కిన్‌ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది. కొల్లాజిన్‌ ఉత్పత్తి కావటం వల్ల యంగ్‌ లుక్‌లో కనిపిస్తారు.
  • నిమ్మకాయ అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రిడియంట్‌. ధర తక్కువ. నిమ్మరసం ముఖానికి పట్టిస్తే ఫ్రెష్‌గా అనిపించటంతో పాటు ముఖం మీద వాపులు తగ్గిపోతాయి. 
  • ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు పోతాయి. ఇందులోని ఆమ్లత్వం వల్ల నల్లటి మచ్చలు తగ్గిపోతాయి.
  • అయితే కొందరి చర్మతత్వానికి సిట్రిక్‌ ఆమ్లం ఉండే ఈ నిమ్మరసం ఇరిటేట్‌ను తెప్పించొచ్చు. మీది మరీ కోమలత్వం చర్మం అయితే డైరెక్టుగా నిమ్మరసాన్ని పట్టించకపోవడమే మంచిది. వేరే ఇంగ్రిడియంట్స్‌ను కలిపి పట్టించుకోవచ్చు. 

వేటిని కలపాలి?

  • ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసంలోకి, కొద్దిగా తేనెను కలిపి బాగా మిక్స్‌ చేసి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటీతో కడిగేయాలి. దీనివల్ల చర్మంలో మృదుత్వం వస్తుంది.
  • ఒక టీస్పూన్‌ నిమ్మరసం, అలొవెరా జెల్‌ను బాగా మిక్స్‌ చేసి ముఖానికి లేదా ఇతర భాగాల్లో పట్టిస్తే సరి ఖచ్చితంగా మంచి మార్పు కనపడుతుంది. 
  • నిమ్మరసానికి పసుపును జోడించి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే మొటిమలు, దద్దుర్లు, చిన్నపాటి గాయాలు, బ్లాక్‌ స్పాట్స్‌ తగ్గిపోతాయి.
  • కాఫీ పొడి, నిమ్మరసం కలిపి కాఫీ మాస్క్‌ వేసుకుని పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరిస్తే సరి.. చర్మం ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

Updated Date - 2022-09-29T20:36:17+05:30 IST