కుల విభజన ఉపాధి చట్టానికి విరుద్ధం

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

కుల విభజన ఉపాధి చట్టానికి విరుద్ధం

కుల విభజన ఉపాధి చట్టానికి విరుద్ధం
కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేస్తున్న

వికారాబాద్‌: కుల విభజన ఉపాధి చట్టానికి విరుద్ధమని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హా మీలో ఒకే వేతనం పొందే కూలీలకు కులాల పేరుతో విభజించే కేంద్ర ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలన్నా రు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ద్వారా వేతనాలు ఇవ్వ డం సరికాదన్నారు. దీనితో కూలీల వేతనాలివ్వడంలో స మస్యలు తలెత్తే అవకాశాలున్నాయని తెలిపారు. కేం ద్రం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా కూలీలకు 6నెలల పాటు నెలకు రూ. 7500, ఉచితంగా రేషన్‌ బియ్యం ఇవ్వాలన్నారు. రోజు కూలి రూ.600 ఇవ్వడంతో పాటు  పనిదినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమలో జిల్లా కార్యదర్శి మహిపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST