Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి హోదాలో ఉద్యోగులను దూషించడం సిగ్గుచేటు: ఉన్నం

కళ్యాణదుర్గం, డిసెంబరు2: రాష్ట్ర మంత్రి అప్పలరాజు ప్రభుత్వ ఉద్యోగులను దూ షించడం సిగ్గు చేటని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి ఖండిం చారు. గురువారం స్థానికంగా ఆయన వ్యక్తిగత కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. వీఆర్‌ఓల పట్ల మంత్రి అసభ్యంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారుల సమీక్షకు వెళ్లిన వీఆర్‌ఓలపై మంత్రి విరుచుకుపడి, గెటౌట్‌అంటూ అ వమానించారన్నారు. వీఆర్‌ఓలు గ్రామ సచివాలయాలకు వస్తే తరిమికొట్టాలనడం ప్ర భుత్వ దిగుజారుడు తనానికి నిదర్శనమన్నారు. వీఆర్‌ఓల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి అప్పలరాజు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు డీకే రామాంజినేయులు, గోవిందరెడ్డి, నారాయణ, షామీర్‌, మునీర్‌, బసవరా జు, రామాంజినేయులు, సర్పంచు లక్ష్మనమూర్తి, నారాయణస్వామి, గోళ్ల రాము పాల్గొన్నారు. 


Advertisement
Advertisement