Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాబు వంటి నేతలుండడం సిగ్గుచేటు: మంత్రి సీదిరి

కాశీబుగ్గ, అక్టోబరు 22: ‘‘సీఎంని బూతులు తిట్టించే నీచ సంస్కృతి కలిగిన నాయకులు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుగా ఉంది. అధికారం కోల్పోయిన నేపథ్యంలో చంద్రబాబుకు ఏమి చేయాలో అర్థంకాక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలను నమ్మించడానికి టీడీపీ దీక్షకు పూనుకోవడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబూ... ఇలాంటివి చేసి రాష్ట్ర ప్రజల ఆగ్రహనికి గురికావద్దు’’ అని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్ష శిబిరానికి శుక్రవారం ఆయన వచ్చారు. దీక్షలో ఉన్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘చంద్రబాబు ముద్దుల కొడుకు లోకేశ్‌కు సరిగా మాట్లాడం రాదు. మాట్లాడితే బూతులు తప్ప ఇంకేమి రావు. దమ్ముంటే పలాస మునిసిపాలిటీలో వార్డు మెంబర్‌గా లోకేశ్‌ పోటీ చేసి గెలవాలి. దానికి కూడా పనికిరాడు’’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 

Advertisement
Advertisement