ఎమ్మెల్యే భూకబ్జాలను అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటు

ABN , First Publish Date - 2022-01-22T04:58:57+05:30 IST

సంతనూత లపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు భూక బ్జాలకు అదుపులేకుండా పోతోందని, అయినా అ ధికారులు మిన్నకుండా ఉండటం సిగ్గుచేటని తె లుగు రైతుసంఘం బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షు డు కొండ్రగుంట వెంకయ్య ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే భూకబ్జాలను అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటు
మాట్లాడుతున్న వెంకయ్య

తెలుగు రైతు సంఘం బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య ధ్వజం


సంతనూతలపాడు, జనవరి 21: సంతనూత లపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు భూక బ్జాలకు అదుపులేకుండా పోతోందని, అయినా అ ధికారులు మిన్నకుండా ఉండటం సిగ్గుచేటని తె లుగు రైతుసంఘం బాపట్ల పార్లమెంట్‌  అధ్యక్షు డు కొండ్రగుంట వెంకయ్య ధ్వజమెత్తారు. శుక్ర వారం ఎస్‌ఎన్‌పాడులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. మద్దిపాడు మండలంలోని కొలచనకోట, వె ల్లంపల్లి గ్రామాలకు పోయే గుండ్లకమ్మ ప్రాజెక్టు పంట కాలువను ఆక్రమించుకుని ఎమ్మెల్యే ని వాసం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తే సంబంధిత అ ధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని ఆరోపించారు. పంట కాలువల ద్వా రా సాగునీటిని పంటలకు సక్రమంగా అందించా ల్సిన బాధ్యత ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేనే స్వ యంగా ఆక్రమించి సొంత నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. అక్రమ ని ర్మాణాలను కూల్చి పంట కాలువను పునరుద్ధరి ంచే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీ సుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించా రు. అలాగే చీమకుర్తి మండలంలో కారుమంచి మేజర్‌ కాలువను కొందరు క్వారీ యాజమాన్యా లు ఆక్రమించడంతో అది కట్ట పూర్తిగా కుంగి క్వా రీలోకి కూలిందని, దీంతో రైతుల వేసిన పంటల కు సాగునీరు అందడం లేదన్నారు. దీనిపై సంబ ంధిత అధికారులపైగానీ, కారకులపైగానీ ఏం చ ర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. సుబాబుల్‌, జామాయిల్‌ కర్రను ప్రభుత్వం నిర్ణయించిన ధర లు కాకుండా దళారులకు రూ.1,100లోపే అమ్ము కోవాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. ప్ర భుత్వం వెంటనే కర్ర రైతులను సమస్యను ప రిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T04:58:57+05:30 IST