వర్క్ ఫ్రమ్‌ ఆఫీస్‌కే ఐటీ కంపెనీల ఓటు

ABN , First Publish Date - 2022-02-24T22:52:58+05:30 IST

ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసిన దానికంటే, ఆఫీస్ నుంచి పనిచేస్తేనే ఉత్పాదకత పెరుగుతుందని ఐటీ కంపెనీలు భావిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ‘రిటర్న్ టు ఆఫీస్’ పేరుతో ‘హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్’ తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

వర్క్ ఫ్రమ్‌ ఆఫీస్‌కే ఐటీ కంపెనీల ఓటు

ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసిన దానికంటే, ఆఫీస్ నుంచి పనిచేస్తేనే ఉత్పాదకత పెరుగుతుందని ఐటీ కంపెనీలు భావిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ‘రిటర్న్ టు ఆఫీస్’ పేరుతో ‘హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్’ తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన దాదాపు 68 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ సర్వే ప్రకారం.. రిటర్న్ టు ఆఫీస్ ద్వారా ప్రొడక్టివిటీ సమస్యలు తీరుతాయని 45 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని 56 శాతం ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను కొనసాగిస్తుండగా, 28 శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేస్తున్నాయి. మిగిలిన 16 శాతం కంపెనీలు ఇంకా మూసే ఉన్నట్లు వెల్లడైంది.


భవిష్యత్‌లో హైబ్రిడ్ మోడల్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. హైబ్రిడ్ మోడ్ అంటే ఉద్యోగులు రోజులో తమకు నచ్చిన టైమ్‌లో, నచ్చిన చోటు నుంచి పనిచేయవచ్చు. కొందరు ఇంటి నుంచి, మరికొందరు ఆఫీస్ నుంచి పనిచేయొచ్చు. హైదరాబాద్‌లోని 65 శాతం ఐటీ కంపెనీలు హైబ్రిడ్ మోడ్‌లో పనిచేసేందుకు అంగీకరిస్తున్నాయి. అయితే వంద శాతం ఉద్యోగులు పనిచేయాలని కోరుకుంటున్నాయి. మరో 15 శాతం కంపెనీలు మాత్రం ఎంప్లాయిస్ పూర్తిగా ఆఫీస్ నుంచే పనిచేయాలని కోరుకుంటున్నాయి. అయితే, ఆఫీస్ నుంచి పనిచేస్తేనే ప్రొడక్టివిటీ సమస్యలు తీరుతాయని కంపెనీలు భావిస్తున్నాయి.

Updated Date - 2022-02-24T22:52:58+05:30 IST