టన్ను ఇసుక రూ.475

ABN , First Publish Date - 2021-04-13T06:05:47+05:30 IST

ఇసుక టన్ను ధర రూ.475లుగా నిర్ణయించారు. వినియోగదారుడు ఏదైనా స్టాక్‌ యార్డ్‌ నుంచి గానీ రీచల నుంచి గానీ ఇసుకను తీసుకెళ్లే సౌకర్యం కల్పించారు.

టన్ను ఇసుక రూ.475

డబ్బు కడితే ఎక్కడి నుంచైనా రవాణా

పట్టా భూముల్లో తవ్వకాలు నిషేధం

అధికారులతో వీసీలో పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది

అనంతపురం కార్పొరేషన, ఏప్రిల్‌12 : ఇసుక టన్ను ధర రూ.475లుగా నిర్ణయించారు. వినియోగదారుడు ఏదైనా స్టాక్‌ యార్డ్‌ నుంచి గానీ రీచల నుంచి గానీ ఇసుకను తీసుకెళ్లే సౌకర్యం కల్పించారు. సోమవారం పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇసుకపై సమీక్షా సమావేశంలో వీడియోకాన్ఫరెన్స ద్వారా పలు విషయాలు వెల్లడించారు.  కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సలో జా యుంట్‌ కలెక్టర్‌, గనుల శాఖ అధికారులు పాల్గొన్నా రు. గనుల శాఖ, ఏపీఎండీసీలు ఒక గడువు తేదీని ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన  ఏజెన్సీకి ఇసుక రీచలు, స్టాక్‌ పాయింట్లను అందజేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశించారు. ఆ గడువులోపు వినియోగదారులు బుక్‌ చేసుకున్న జనరల్‌, బల్క్‌ ఇసుక ఆర్డర్లను రద్దు చేసి వారికి బుక్‌ చేసుకున్న డబ్బును ఏపీఎండీసీ తిరిగి ఇవ్వాలని సూ చించారు. వినియోగదారుడు తనకు ఇష్టం వచ్చిన స్టాక్‌ పాయింట్‌ లేదా రీచ నుంచి డబ్బు చెల్లించి ఇసుక రవా ణా చేసుకోవచ్చన్నారు. గనుల శాఖ అనుమతి రావాల్సిన ఇసుక రీచల వివరాలు, అనుమతి పత్రాలను ఏజెన్సీకి అందజేయాలన్నారు. ఇసుక నిల్వల్లో ఏదైనా తేడా అనిపిస్తే సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకో వచ్చన్నారు. ఒకటి నుంచి 5వ గ్రేడ్‌ నదులు, వాగుల్లో ఎడ్లబండి ద్వారా ఉచితంగా సొంత ఇంటి నిర్మాణానికి ఇసుకను వాడుకోవచ్చన్నారు. నదులకు దగ్గరగా ఉండే గ్రామస్థులకు గను ల శాఖ ఏడీ నోటిఫికేషన ఇస్తారన్నారు. పట్టా భూ ముల్లో ఇసుక తవ్వకాలు, రవాణా పూర్తిగా నిషేధించినట్టు  ఆయన స్పష్టం చేశారు.


Updated Date - 2021-04-13T06:05:47+05:30 IST