అటవీప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు

ABN , First Publish Date - 2020-12-02T06:39:20+05:30 IST

మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ఇసుకదందాకు పాల్పడుతున్నారు. రీచ్‌ ఒకచోట ఉంటే తవ్వకాలు మాత్రం అటవీప్రాంతంలో రాత్రి వేళల్లో యథేచ్ఛగా సాగి స్తున్నారు. గ్రామంలో అధికారులు ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు.

అటవీప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు
అటవీ ప్రాంతంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టిన దృశ్యం

అధికార పార్టీ నాయకుల నయా దందా 

 పట్టించుకోని అధికారులు

పెనుకొండ, డిసెంబరు 1: మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ఇసుకదందాకు పాల్పడుతున్నారు. రీచ్‌ ఒకచోట ఉంటే తవ్వకాలు మాత్రం అటవీప్రాంతంలో రాత్రి వేళల్లో యథేచ్ఛగా సాగి స్తున్నారు. గ్రామంలో అధికారులు ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు ఆరు నెలలుగా అటవీప్రాంతంలో ఎవరికి వారు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇసుకను తవ్వకాలు చేపట్టి డంప్‌ చేసుకుని అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం లో కొందరు ఇసుక రీచ్‌నుంచి ఇసుకను తరలిస్తున్నారు. అధికార పార్టీ నా యకులు మాత్రం అటవీప్రాంతంలో ఇసుక నాణ్యతగా ఉంటుందని దీనిని అదునుగా చేసుకుని ఆరునెలలుగా అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టి ఒక్కో ట్రాక్టరు రూ.5వేలకుపైగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇసుక అక్రమ తనిఖీల కోసం ఫా రెస్ట్‌ అధికారులు వెళ్లగా వారి ద్విచక్రవాహనాలకు పంక్చర్‌ చేయడం జరిగిందని గ్రామంలో బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అటవీప్రాంతంలో అక్రమ ఇసుక తరలిచండంవల్ల భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు లు, అటవీశాఖ అధికారులు స్పందించి అటవీప్రాంతంలో ఇసుకను తరలించేవారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈవిషయంపై ఎఫ్‌ఆర్‌ఓను వివరణ కోరగా అటవీప్రాంతంలో ఎవరైనా ఇసుకను తరలిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల అటవీప్రాంతంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తనిఖీలు చేయగా అప్పటికే పసిగట్టిన ట్రాక్టర్ల యజమానులు అక్కడి నుంచి పరారయ్యారన్నారు. త్వరలో ప్రత్యేక టీమ్‌ ఏర్పాటుచేసి అక్రమ ఇసుక తరలించే వారిపై నిఘా పెడతామన్నారు.

Updated Date - 2020-12-02T06:39:20+05:30 IST