విధుల పట్ల ఇంత నిర్లక్ష్యమా?

ABN , First Publish Date - 2020-06-07T10:28:54+05:30 IST

ప్రభుత్వం గ్రామ, పట్టణాల్లో పరిశుభ్రత కోసం నిధులు కేటాయిస్తున్నప్పటికీ విధుల నిర్వహణ పట్ల ఎందుకు అలసత్వం

విధుల పట్ల ఇంత నిర్లక్ష్యమా?

భద్రాద్రిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

డీపీవోకు షోకాజ్‌ నోటీసు జారీ చేయండి

ఎంపీడీను బదిలీ చేయాలని జడ్పీ సీఈవోకు ఆదేశం

పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌


ఆంధ్రజ్యోతి కొత్తగూడెం/ భద్రాచలం, జూన్‌ 6: ప్రభుత్వం గ్రామ, పట్టణాల్లో పరిశుభ్రత కోసం నిధులు కేటాయిస్తున్నప్పటికీ విధుల నిర్వహణ పట్ల ఎందుకు అలసత్వం వహిస్తున్నారని డీపీవో, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోలపై జిల్లా కలెక్టరు ఎంవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం భద్రాచలం పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, డ్రెయినేజీల నిర్వహణను కలెక్టరు ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈసందర్భంగా డ్రెయినేజీ నిర్వహణ, రహదారుల వెంబడి వ్యర్ధాలు ఎందుకు పరిశుభ్రం చేయలేదని, ఇంత అపరిశుభ్రత ఉంటే మీరేం చేస్తున్నారని డీపీవో, పంచాయతీ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీకార్యదర్శి బదిలీకి ప్రతిపాదనలు పంపాలని మూడు నెలల క్రితం డీపీవోకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నేటి వరకు తనకు ఎందుకు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ విషయంలో డీపీవోకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. నర్సరీ ఏర్పాటులో తీవ్ర జాప్యం చేయడంపై ఎంపీడీవోపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఎంపీడీవోను బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. నర్సరీలో మొక్కలు పరిశీలించి తెప్పించి 25 రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు బ్యాగులు మార్చలేదని ఎంపీడీవో రవీందర్‌ను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డీపీవో ఆశాలత, భద్రాచలం ఆర్డీవో స్వర్ణలత, ఎంపీడీవో రవీంద్రనాధ్‌, తహసీల్దార్‌ శేషగిరిరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


వరదలతో ప్రజలు ఇబ్బందిపడొద్దు

గోదావరి వరదతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టరు డా. ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. శనివారం గోదావరి కరకట్ట విస్తా కాంప్లెక్సు స్నాన ఘట్టాలను కలెక్టరు పరిశీ లించారు. గత ఏడాది 51.2 అడుగుల వరకు గోదావరి వచ్చిందని ఆ సమ యం లో ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ప్రణాళికలు తయారు చేయా లని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ రాం ప్రసాద్‌, డీపీవో ఆశాలత, ఆర్డీవో స్వర్ణలత, తహసీల్దారు శేషగిరిరావు పా ల్గొన్నారు.


వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి

వివిధ రాష్ట్రాల నుంచి లారీల్లో వస్తువులు సరఫరా చేస్తున్న వాహనాలకు ప్ర త్యేకంగా పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేయాలని లెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అధికా రులకు సూచించారు. శనివారం భద్రాచలం పర్యటన ముగించుకొని తిరిగి వస్తు న్న కలెక్టర్‌ పాల్వంచ నవభా రత్‌ పరిశ్రమ ముందు రహదారికి ఇరువైపులా నిలిపిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన లారీల భారీ సంఖ్య లో పార్కింగ్‌ చేసి ఉండటం గమనించారు. రహదారుల పక్కన వాహనాలునిలుపుదల చేయడం ప ట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చా రు. తన పర్యటనల్లో రహదా రుల పక్కన లారీలు పార్కింగ్‌ గమనిస్తే సంబం ధిత పరిశ్రమల నిర్వాహకులపై వ్యాధి నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.


Updated Date - 2020-06-07T10:28:54+05:30 IST