తూర్పు గోదావరి జిల్లా: జిల్లాలోని రామచంద్రపురం సబ్‌జైల్ కానిస్టేబుల్ జి.రాముకు జైళ్లశాఖ ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. మూడేళ్ల చిన్నారిపై కంటిచూపు కోల్పోయేలా కానిస్టేబుల్ రాము దాడి చేశాడు. ఈ ఘటనపై జైళ్లశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా సబ్‌జైల్ కానిస్టేబుల్ రాముకు మెమో జారీ చేసినట్లు జైళ్లశాఖ ఉన్నతాధికారి కమలాకర్ తెలిపారు.