పోరుపై ఉత్కంఠ..!

ABN , First Publish Date - 2021-01-24T05:40:09+05:30 IST

జిల్లాలో 50 మండలాల పరిధిలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కడప రెవెన్యూ డివిజన పరిధిలో 260, రాజంపేట రెవెన్యూ డివిజన పరిధిలో 268, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన పరిధిలో 279 పంచాయతీలు ఉన్నాయి.

పోరుపై ఉత్కంఠ..!
తొలి విడతలో ఎన్నికలు జరిగే వేంపల్లి పంచాయతీ కార్యాలయం

తొలి విడత ఎన్నికల నోటిఫికేషన జారీ

నాలుగు విడతల్లో పోలింగ్‌

ఫేజ్‌-1లో 220 పంచాయతీలకు ఎన్నికలు

ఎన్నికలకు దూరంగా అధికారులు

అందరి దృష్టి సుప్రీంకోర్టు నిర్ణయంపైనే 

రాజకీయ నాయకుల్లోనూ కనిపించని హడావిడి


 స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన సిగ్నల్‌.. వీటిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం.. వ్యాక్సినేషన తరువాతే ఎన్నికలు జరపండని రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్‌.. వెరసి ఎన్నికలు జరుగుతాయా..? సామాన్య ప్రజల్లో నెలకొన్న ప్రశ్న. ఎవరి ఆలోచన ఎలా ఉన్నా ఎన్నికలు జరిపి తీరుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే శనివారం తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన జారీ చేసింది. జిల్లాలో ఫేజ్‌-1 కింద 13 మండలాల పరిధిలోని 220 పంచాయతీలకు ఎన్నికల నోటిషికేషన జారీ చేశారు. అయితే పంచాయతీల్లో మాత్రం ఎన్నికల హడావిడి కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్న దాఖలాలు లేవు. జిల్లాలో అధికారులు దాదాపుగా దూరంగా ఉన్నారు. ఇటు ఎస్‌ఈసీ.. అటు రాష్ట్ర ప్రభుత్వం.. మెట్టు దిగకపోవడంతో సుప్రీంకోర్టు తీర్పుపైనే అందరి దృష్టి ఉంది. దీంతో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో 50 మండలాల పరిధిలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కడప రెవెన్యూ డివిజన పరిధిలో 260, రాజంపేట రెవెన్యూ డివిజన పరిధిలో 268, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన పరిధిలో 279 పంచాయతీలు ఉన్నాయి. నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన జారీ చేసింది. తొలి విడతలో ఎన్నికలు జరిగే జమ్మలమడుగు రెవెన్యూ డివిజనలో 11 మండలాలు, కడప రెవెన్యూ డివిజనలో 2 మండలాలు కలిపి 13 మండలాల పరిధిలో 220 పంచాయతీలకు ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన ఇచ్చారు. ఫేజ్‌-1 పంచాయతీల్లో ఈనెల 25వ తేదీ నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న పరిశీలన, 29న అఽభ్యంతరాలు, నామినేషన్ల తిరస్కరణ, 31వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సాయంత్రం 3.00 గంటల తరువాత బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 5న ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్‌, 4.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిషికేషనలో పేర్కొన్నారు. అలాగే.. ఫేజ్‌-2 ఎన్నికలకు ఈనెల 29న, ఫేజ్‌-3 ఎన్నికలకు ఫిబ్రవరి 2న, ఫేజ్‌-4 ఎన్నికలకు ఫిబ్రవరి 6న నోటిఫికేషన జారీ అవుతుందని షెడ్యూలులో వెల్లడించారు.


అమల్లో ఎన్నికల కోడ్‌

రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాతీయ ఎన్నికల షెడ్యూలు జారీ చేసిన నాటి నుంచి గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. అయితే.. ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కొందరు కోడ్‌ను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారు. ప్రజాప్రతినిధులతో కలసి సమీక్ష సమావేశాల్లో పాల్గొనడంతో విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘమే నోటిఫికేషన జారీ చేయడంతో కోడ్‌ పక్కాగా అమల్లోకి వచ్చినట్లేనని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా.. తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో అధికారులు మాత్రం తమకు ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొనడం కొసమెరుపు. ఎన్నికల సమాచారం ఇవ్వకపోగా.. మమ్ములను అడక్కండి.. మా పేరు కూడా రాయకుండి అంటూ తప్పించుకుంటున్నారు. 


రాజకీయ పార్టీల్లో కనిపించని సందడి

ఎన్నికల జరిపి తీరాలని ఎస్‌ఈసీ దృఢ సంకల్పం.. ఎలాగైనా వాయిదా వేయించాలని ప్రభుత్వ పెద్దల ఎత్తులు.. వెరసి పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరుగుతాయో.. లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేసినప్పుడు చూద్దాం..! అనే ధోరణిలో రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. దీంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి కనిపించడం లేదు. 


ఎన్నికలకు దూరంగా అధికారులు

ఎస్‌ఈసీ నోటిఫికేషన జారీ చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు గ్రామ పోరుకు దూరంగా ఉన్నారు. కనీసం ఏర్పాట్లు కూడా చేయడం లేదు. గత ఏడాది మార్చిలో సమకూర్చుకున్న ఏర్పాట్లతోనే ఉన్నారు. ఎస్‌ఈసీ నోటిఫికేషన ప్రకారం 25వ తేది నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాలి. అంటే మిగిలిన సమయం రెండు రోజులే. నేడు ఆదివారం సెలవు. పంచాయతీల వారీగా పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఏఏ పంచాయతీకి ఎంతమంది సిబ్బంది కేటాయింపు, బ్యాలెట్‌ పత్రాలు ముద్రణ.. వంటి కనీస ఏర్పాట్లు కూడా చేయడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా సహాయ నిరాకరణే చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టరు హరికిరణ్‌ దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా ప్రభుత్వ ఆదేశాలు ఇంతవరకు రాలేదని పేర్కొనడం కొసమెరుపు.


జిల్లాలో పంచాయతీలు, ఓటర్ల వివరాలు

---------------------------------------------------

మండలాలు : 50

పంచాయతీలు : 807

వార్డులు : 7,900

ఓటర్లు : 14,70,900

పురుషులు : 7,27,498

మహిళలు : 7,43,295

ఇతరులు : 112

పోలింగ్‌ కేంద్రాలు : 7,896

సమస్యాత్మక కేంద్రాలు : 831

అత్యంతసమస్యాత్మక కేంద్రాలు : 943

ఎన్నికలకు కావాల్సిన సిబ్బంది : 18,600

-----------------------------------------------------


నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగే మండలాల వివరాలు

--------------------------------------------------------------------------------------------

ఫేజ్‌-1 ఫేజ్‌-2 ఫేజ్‌-3 ఫేజ్‌-4

---------------------------------------------------------------------------------------------

జమ్మలమడుగు జమ్మలమడుగు కడప డివిజన రాజంపేట డివిజన

---------------------- ----------------------- --------------- -----------------------

పులివెందుల చాపాడు రాయచోటి రైల్వేకోడూరు

సింహాద్రిపురం మైదుకూరు గాలివీడు ఓబులవారిపల్లె

తొండూరు దువ్వూరు చిన్నమండెం చిట్వేలి

వేంపల్లి ప్రొద్దుటూరు సంబేపల్లి పెనగలూరు

వేముల రాజుపాలెం లక్కిరెడ్డిపల్లె పుల్లంపేట

లింగాల కడప డివిజన రామాపురం రాజంపేట

జమ్మలమడుగు -------------- కమలాపురం సిద్దవటం

కొండాపురం ఖాజీపేట వీఎనపల్లె ఒంటిమిట్ట

ముద్దునూరు రాజంపేట డివిజన పెండ్లిమర్రి నందలూరు

మైలవరం ---------------- సీకేదిన్నె కడప డివిజన

పెద్దముడియం బద్వేలు వల్లూరు --------

కడప విడిజన అట్లూరు చెన్నూరు టి.సుండుపల్లె

----------- బి.కోడూరు -- వీరబల్లి

చక్రాయపేట గోపవరం -- --

ఎర్రగుంట్ల పోరుమామిళ్ల -- --

-- కాశినాయన -- --

-- కలసపాడు -- --

-- బి.మఠం -- --

-----------------------------------------------------------------------------------------

Updated Date - 2021-01-24T05:40:09+05:30 IST