30న ఇస్రో వాణిజ్య ప్రయోగం

ABN , First Publish Date - 2022-06-23T07:45:55+05:30 IST

ఇస్రో పూర్తి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగానికి రెడీ అయింది. ఈ నెల 30న పీఎ్‌సఎల్వీ-సీ53 రాకెట్‌ ద్వారా మూడు సింగపూర్‌ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.

30న ఇస్రో వాణిజ్య ప్రయోగం

శ్రీహరికోట (సూళ్లూరుపేట), జూన్‌ 22: ఇస్రో పూర్తి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగానికి రెడీ అయింది. ఈ నెల 30న పీఎ్‌సఎల్వీ-సీ53 రాకెట్‌ ద్వారా మూడు సింగపూర్‌ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని రెండవ ప్రయోగ వేదికనుంచి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగిస్తామని వెల్లడించింది. దీనికోసం ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది.

Updated Date - 2022-06-23T07:45:55+05:30 IST