ఇటలీకీ ఇస్రో ‘సహకారం’!

ABN , First Publish Date - 2021-03-05T07:42:32+05:30 IST

బ్రెజిల్‌ దేశానికి చెందిన ఉపగ్రహం అమెజానియా-1ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. అంతరిక్ష రంగంలో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో

ఇటలీకీ ఇస్రో ‘సహకారం’!

బెంగళూరు, మార్చి 4: బ్రెజిల్‌ దేశానికి చెందిన ఉపగ్రహం అమెజానియా-1ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. అంతరిక్ష రంగంలో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ బుధవారం ఇటలీ అంతరిక్ష సంస్థ(ఏఎ్‌సఐ) అధ్యక్షుడు జార్జియో సక్కోక్సియాతో వర్చువల్‌గా చర్చించారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న సహకారంపై ఇరు పక్షాలు చర్చించాయి. భూ పరిశీలన, అంతరిక్ష విజ్ఞానం, రోబోటిక్‌, మానవ అన్వేషణ అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు మరిన్ని థీమేటిక్‌ వర్కింగ్‌ గ్రూపుల ఏర్పాటుకు ఇరు పక్షాలూ అంగీకరించాయి’ అని అనంతరం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

Updated Date - 2021-03-05T07:42:32+05:30 IST