పాలస్తీనియన్ల కోసం మిలియన్ కొవిడ్ టీకాలను పంపనున్న ఇజ్రాయెల్

ABN , First Publish Date - 2021-06-19T01:01:06+05:30 IST

దేశంలోని దాదాపు 80 శాతం మంది ప్రజలకు టీకాలు వేసినా తమ అధీనంలో ఉన్న గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని

పాలస్తీనియన్ల కోసం మిలియన్ కొవిడ్ టీకాలను పంపనున్న ఇజ్రాయెల్

జెరూసలెం: పాలస్తీనియన్ అథారిటీకి త్వరలోనే మిలియన్ కరోనా టీకా డోసులను పంపనున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మేరకు పాలస్తీనియన్ అథారిటీతో ఒప్పందం కుదర్చుకున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి టీకా కార్యక్రమంలో భాగంగా సరఫరా చేయనున్న టీకాలు పాలస్తీనియన్ అథారిటీకి అందగానే అది ఇజ్రాయెల్‌కు వాటిని బదిలీ చేయనుంది. దేశంలోని 85 శాతం మంది జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తిచేసిన ఇజ్రాయెల్ దాని అధీనంలో ఉన్న గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లకు వ్యాక్సిన్లు వేయడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్‌లో ఆదివారం కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలస్తీనియన్ అథారిటీతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది.  

Updated Date - 2021-06-19T01:01:06+05:30 IST