టెల్ అవివ్ (ఇజ్రాయెల్):ఇజ్రాయెల్ విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది.కొవిడ్-19 టీకాలు వేయించుకోకుండా ఉన్న టీచర్లపై నిషేధాస్త్రం విధిస్తూ ఇజ్రాయెల్ విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. కొవిడ్ టీకాలు వేయించుకోని ఉపాధ్యాయులు పాఠశాలల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తామని విద్యామంత్రిత్వశాఖ తెలిపింది. పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే ఉపాధ్యాయులు కొవిడ్ టీకా తీసుకున్నట్లు పాస్ లేదా కరోనా యాంటీజెన్ పరీక్ష నెగిటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉందని ఇజ్రాయెల్ విద్యాశాఖ పేర్కొంది.
ఇజ్రాయెల్ దేశంలో కొవిడ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి ఇజ్రాయెల్ సర్కారు టీకా తీసుకోని టీచర్లపై నిషేధం విధించింది. టీకా తీసుకోని ఉపాధ్యాయులు పాఠశాలల్లోకి అనుమతించరు కాబట్టి వారు గైర్హాజరు అయిన రోజులకు జీతాలు చెల్లించమని విద్యామంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. టీకా వేయించుకోని ఉపాధ్యాయులను జూమ్ ద్వారా రిమోట్ గా బోధించడానికి కూడా అనుమతించమని ఇజ్రాయెల్ విద్యామంత్రిత్వశాఖ తెలిపింది.