చేతులు ఎత్తేశారా..?!

ABN , First Publish Date - 2020-09-13T09:58:39+05:30 IST

కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. భూపాలపల్లి జిల్లాలో పా జిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

చేతులు ఎత్తేశారా..?!

 కరోనాపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం!

భూపాలపల్లి జిల్లాలో ఐసోలేషన్‌ వార్డుల కరువు

ఐసీయూ సౌకర్యం లేక బాధితుల ఇక్కట్లు

వైద్యుల నుంచి లేని ఫోన్‌ పలకరింపు  

ఆరోగ్యం విషమిస్తే ఎంజీఎంకు పరుగు

వైద్య శాఖలో భారీగా డాక్టర్లు, సిబ్బంది కొరత

ప్రైవేటు ఆస్పత్రులే శరణ్యమంటున్న రోగులు


భూపాలపల్లి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. భూపాలపల్లి జిల్లాలో పా జిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయినా అధి కార యంత్రాంగం బాధితులకు అరకొరగానే సౌకర్యా లు కల్పిస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రైవేటు వైద్యమే శర ణ్యమంటున్నారు రోగులు. హోం ఐసోలేషన్‌లో ఉంటే వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసే నాథుడే కరువు య్యాడనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో కనీసం ఒక్కటి కూడా ఐసోలేషన్‌ వార్డు లేకపోవటం అధికారు ల నిర్లక్ష్యానికి నిదర్శమని తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి విషమిస్తే ఆయువు అందించే వెంటిలేటర్‌ సౌకర్యం కూడా లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. 


భూపాలపల్లి జిల్లాలో ఏప్రిల్‌లో కరోనా తొలి కేసు నమోదైంది. ప్రస్తుతం 2 వేల పాజిటివ్‌ కేసులు నమో దు కాగా 600 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏడుగురు ఈ వైరస్‌తో మృతిచెందారు. భూపా లపల్లి పట్టణంలో అత్యధికంగా కరోనా కేసులు నమో దు అవుతున్నాయి. సింగరేణి కార్మికుల కోసం ఆ సంస్థ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా సామాన్య ప్రజలకు కరోనా పాజిటివ్‌ వస్తే ఇక అంతే సంగతులు. దీనికి తోడు జిల్లాలోని ఆస్పత్రుల్లో వైద్యు లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జిల్లా ఆప్పత్రిలో ఇప్పటి వరకు ఒక వైద్యుడిని కూడా రిక్రూట్‌ చేయలే దు.


ఇక చిట్యాల, మహదేవపూర్‌ ఏరియా ఆస్పత్రులు, 12 పీహెచ్‌సీలకు 21 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా  14మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నా రు. 13 మంది స్టాఫ్‌ నర్సులకు తొమ్మిది మంది మాత్ర మే పని చేస్తున్నారు. 15 మంది ల్యాబ్‌ టెక్నిషీయన్లకు  తొమ్మిది మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరితోపా టు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మంది ఫార్మసిస్టులు, 27మంది ఏఎన్‌ఎంలను భర్తీ చేయాల్సి ఉంది.


ఐసోలేషన్‌ వార్డులెక్కడ..?

కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పా టు చేసింది. భారీగా నిధులు కూడా మంజూరు చేస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు, సహకారం అం దుతున్నా కరోనా బాధితులకు సౌకర్యాలు మెరుగుపడ టం లేదు. జిల్లా ఆస్పత్రితో పాటు చిట్యాల, మహదేవ పూర్‌ ఏరియా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పా టు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ, ఏ ఒక్క చోటా అందుబాటులోకి రాలేదు.


అయితే.. భూపా లపల్లి, చిట్యాలలో ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. ఐసోలేషన్‌ వార్డులుంటే వైద్యులు, సిబ్బంది దగ్గరుండి కరోనా బాధితులకు వైద్యం అందించటంతో పాటు సమయానికి మందులు, ఆహారం అందిస్తారు. అయితే.. అన్ని జిల్లాలో ఐసోలేషన్‌ వార్డులు ఉన్నప్పటికీ భూపాలపల్లి జిల్లాలోనే ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఐసోలేషన్‌ వార్డు లకు మంజూరవుతున్న నిధులు ఏమవుతన్నాయనేది చర్చనీయాంశమైంది. 


ఆపదస్తే.. అంతేనా..?!

భూపాలపల్లిలో పేరుకే జిల్లా ఆస్పత్రి.. ఇక్కడ కనీస సౌకర్యలు అందుబాటులో లేవు. వైద్యులు, సిబ్బంది నియామకాలు ఇంకా జరగలేదు. వందకు పైగా గదులు ఉన్న ఈ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చి బాధితులకు సేవలు అందించాల్సి ఉండగా, అందులో ఐసోలేషన్‌ సెంటర్‌ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రితో పాటు మహదేవపూర్‌, చిట్యాలలో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఈ మూడు ఆస్పత్రుల్లో ఎక్కడ కూడా ఐసీయూ సౌకర్యం లేదు.


కరోనా బాధితుడి పరిస్థితి విషమిస్తే ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యం లేక పోవటం, కనీసం దగ్గరుండి పరిశీలించే వైద్యులు కూడా అందుబాటులో ఉండకపోవటంతో పోతే బాధితుడి ప్రాణాలు పోవాలి.. లేదంటే వరంగల్‌ ఎంజీఎంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉండటంతో చాలా మంది లక్షలాది రూపాయలు వెచ్ఛించి ప్రైవేటు ఆస్ప త్రుల్లో చేరుతున్నారు. అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకు ని ఆరోగ్యం కోసం ప్రైవేటు వైద్యాన్ని నమ్ముకోవాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పలకరింపు కరువాయే..

 భూపాలపల్లి జిల్లాలో 12 పీహెచ్‌సీలు, రెండు ఏరి యా ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రి ఉంది. అన్ని చోట్ల కరోనా పరీక్షలు రాపిడ్‌ కిట్లతో చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రభుత్వం అందించే కిట్‌ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. చాలా మంది హోం ఐసోలేషన్‌కే పరిమితమవుతున్నారు. అయితే హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి దారు ణంగా మారింది. ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకో వాలో తెలియని పరిస్థితి. కనీసం సంబంధిత పీహెచ్‌ సీ లేదా ఏరియా ఆస్పత్రి నుంచి వైద్యులు గానీ, ఆరో గ్య సిబ్బంది గానీ బాధితుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థి తి తెలుసుకోవడమో.. కనీసం ఫోన్‌లో పలకరించడమో లాంటి పరిస్థితులు కూడా చాలా చోట్లా లేవు. దీంతో ఏ చిన్న సమస్య వచ్చినా అనేక మంది బాధితులు హైరానా పడాల్సి వస్తోంది.


ఏ మందులు వాడాలో తెలియక సతమతమవుతున్నారు. పట్టించుకునేవారు లేకపోవటంతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పోసప్పో చేసి లక్షలు చెల్లించుకోవాల్సి వస్తోంది. దీంతో కరోనా వైరస్‌పై అధికార యంత్రాంగం చేతు లెత్తేసిందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం కోట్లాది రూ పాయలు మంజూరు చేసినా అధికారులు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించ కపోవడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఐసోలైషన్‌ వార్డుల ను జిల్లా కేంద్రంతోపాటు చిట్యాల, మహదేవపూర్‌ ఏరి యాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-09-13T09:58:39+05:30 IST