ఐసోలేషన్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తాం

ABN , First Publish Date - 2021-05-18T07:32:41+05:30 IST

ఆక్సిజన్‌ బెడ్ల ఐసోలేషన్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగందర్‌ రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌అన్నారు. సోమవారం తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రా న్ని తనిఖీ చేసి రికార్డులను, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.

ఐసోలేషన్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తాం
తుంగతుర్తి ఆసుపత్రిని పరిశీలిస్తున్నజడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికా యుగందర్‌రావు, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

 జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగందర్‌ రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌

తుంగతుర్తి, మే 17: తుంగతుర్తి ఆసుపత్రిలో 12 ఆక్సిజన్‌ బెడ్ల ఐసోలేషన్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని   జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగందర్‌ రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌అన్నారు. సోమవారం తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రా న్ని తనిఖీ చేసి రికార్డులను, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర తరంగా ఉన్నందున ఈప్రాంత ప్రజల సౌకర్యార్థం తుంగతుర్తి ఆసు పత్రిలో 12 ఆక్సిజన్‌ బెడ్లతో కూడిన ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై ఆర్‌డబ్యూఎస్‌, పంచాయ తీరాజ్‌ అధికారులు దృష్టిసారించాలన్నారు. పరీక్షల కోసం వచ్చిన వారికి ఆస్పత్రి సిబ్బంది వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి మెడి కల్‌ కిట్లు అందచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ పులుసు యాదగిరి, డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్ధన్‌, తహసీల్దార్‌ రాంప్రసాద్‌, ఏఈలు నవ కాంత్‌, అనూష, నల్లు రాంచంద్రారెడ్డి, డాక్టర్‌ మోహన్‌కుమార్‌, సరళ, జోష్న, సూరి, గోవిం దరెడ్డి పాల్గొన్నారు.

 ప్రజలకు అందుబాటులో ఉండాలి

 నూతన్‌కల్‌/అర్వపల్లి: కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే  గాదరి కిషోర్‌ కు మార్‌ కోరారు. నూతనకల్‌, అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోమవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెం ట జడ్పీచైర్మన్‌ గుజ్జ దీపిక యుగందర్‌రావు, ఎంపీపీలు భూరెడ్డి కళా వతి సంజీవరెడ్డి,  మన్నె రేణుకలక్ష్మినర్సయ్యయాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు కనకటి వెంకన్న, కుంట్ల సురేందర్‌రెడ్డి,  సర్పంచ్‌ లే  కరుణశ్రీ, సునిత, ఎంపీటీసీ  రమ, పద్మ, వైద్యాధి కారి త్రివేణి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు చూడి లింగా రెడ్డి, మున్న మల్లయ్య ఉన్నారు. 

 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 మద్దిరాల:కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. మం డల కేంద్రంలో లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న తీరును ఆయన ప రిశీలించి మాట్లాడారు. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి రావాలని కోరారు. ఆయన వెంట జడ్పీచైర్మన్‌ గుజ్జ దీపిక యుగంద ర్‌రావు, తాహసీల్దార్‌ మన్నన్‌, సర్పంచ్‌ ఫోరం మండల అధ్యక్షుడు కె.విష్ణువర్దన్‌రెడ్డి,  వైస్‌ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాంరెడ్డి, నాయకులు గుడ్ల వెంకన్న, కన్న వీరన్న, సర్పంచ్‌ వల్లపు యాకయ్య, మధు సూదన్‌, వెంకట్‌రెడ్డి ఉన్నారు. 





Updated Date - 2021-05-18T07:32:41+05:30 IST