Abn logo
Sep 25 2021 @ 00:29AM

ఏయూకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌

ఐఎస్‌వో సర్టిఫికెట్‌ అందుకుంటున్న కృష్ణమోహన్‌

ఏయూ క్యాంపస్‌, సెప్టెంబరు 24: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2024వ సంవత్సరం వరకు ఐఎస్‌వో 9001:2015 గుర్తింపు లభించింది. ఇటీవల రెండు రోజుల పాటు ఏయూలోని పలు విభాగాలు, రీసెర్స్‌ సెంటర్లలో అకడమిక్‌, అడ్మిన్‌స్ట్రేటివ్‌ ఆడిట్‌ను హైదరాబాద్‌కు చెందిన టీయూవీ ఎస్‌యూడీ సంస్థ నిర్వహించింది. అనంతరం ఏయూకు ఐఎస్‌వో గుర్తింపును అందిస్తూ ధ్రువపత్రాన్ని జారీచేశారు. దీనిపై వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్‌వో ధ్రువపత్రాన్ని ఐక్యూఏసీ సమన్వయకర్త ఆచార్య డి. లలిత భాస్కరి రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌కు అందజేశారు. కార్యక్రమంలో రెక్టార్‌ సమత, కంప్యూటర్‌ సెంటర్‌ డైరెక్టర్‌ రమాసుధ తదితరులు పాల్గొన్నారు.