ఎవరికీ హాని చేయకూడదని నేర్పే ధర్మమే ఇస్లాం

ABN , First Publish Date - 2021-10-20T06:33:19+05:30 IST

ఎదుటి వారికి ఎలాంటి హాని చేయకూడదని నేర్పే ధర్మమే ఇస్లాం అని మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ పుట్ట కిషోర్‌ అన్నారు.

ఎవరికీ హాని చేయకూడదని నేర్పే ధర్మమే ఇస్లాం
మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాల్లో మాట్లాడుతున్న మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ కిషోర్‌

సూర్యాపేట కల్చరల్‌ / నడిగూడెం, అక్టోబరు 19 : ఎదుటి వారికి ఎలాంటి హాని చేయకూడదని నేర్పే ధర్మమే ఇస్లాం అని మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ పుట్ట కిషోర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో మంగళవారం నిర్వ హించిన మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాల వేడుకల్లో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేస్తోందన్నారు. కార్యక్రమంలో గోనే అశోక్‌, ఈద ప్రవీణ్‌, ముస్లింలు పాల్గొన్నారు. అదేవిధంగా నడిగూడెంలో  మహమ్మద్‌ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని మిలాద్‌ నబీ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసి జాగరం చేశారు. అనంతరం పాయసం, సేమియలను పంచిపెట్టి శుభకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2021-10-20T06:33:19+05:30 IST