Islamic State Terror Group: టర్కీ నిర్బంధంలో ఇస్లామిక్ స్టేట్ కొత్త చీఫ్

ABN , First Publish Date - 2022-05-28T17:13:29+05:30 IST

ఇస్లామిక్ స్టేట్ (Islamic State -ఐసిస్) ఉగ్రవాద సంస్థ కొత్త చీఫ్

Islamic State Terror Group: టర్కీ నిర్బంధంలో ఇస్లామిక్ స్టేట్ కొత్త చీఫ్

న్యూఢిల్లీ : ఇస్లామిక్ స్టేట్ (Islamic State -ఐసిస్) ఉగ్రవాద సంస్థ కొత్త చీఫ్  అబు హసన్ అల్-హషేమీ అల్-ఖురాషీ ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీ (Turkey)లోని ఇస్తాంబుల్‌లో జరిగిన దాడుల్లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఓ టర్కిష్ న్యూస్ వెబ్‌సైట్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే పట్టుబడిన వ్యక్తి పేరును అబు అల్-హసన్ అల్-ఖురాయిషిగా పేర్కొంది. 


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు గతంలో నాయకత్వం వహించిన అబు ఇబ్రహీం అల్-ఖురాషీ హత్యకు గురైన తర్వాత ఆ పదవిని చేపట్టిన వ్యక్తిని తాము నిర్బంధించామని టర్కీ భద్రతాధికారులు భావిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అబు ఇబ్రహీం అల్-ఖురాషీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరియాలో అమెరికా ఆపరేషన్‌లో మరణించినట్లు ఓ వార్తా సంస్థ చెప్పింది. 


2019లో అమెరికా కమాండో దాడిలో అంతకుముందు ఈ సంస్థకు నాయకత్వం వహించిన అబు బకర్ అల్-బగ్దాదీ హత్యకు గురయ్యాడు. వీరిద్దరి మరణం ఈ సంస్థకు పెద్ద లోటు అని చెప్తున్నారు. 


Updated Date - 2022-05-28T17:13:29+05:30 IST